Nizamabad | మోడల్ స్కూల్ విద్యార్ధినిలు అదృశ్యం

Nizamabad | ఆందోళనలో తల్లిదండ్రులు గాలిస్తున్న పోలీసు బృందాలు విధాత:ప్రతినిధి నిజామాబాద్ జిల్లా రెంజల్ మోడల్ స్కూల్ కు చెందిన ఇద్దరు విద్యార్థినిలు అదృశ్యమైన ఘటన సంఛలనంగా మారింది. పాఠశాలలో ఉండాల్సిన తమ పిల్లలు అక్కడా ఉండకా..ఇంటికి రాక ఏమైపోయి ఉంటారంటు వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు అదృశ్యమైన విద్యార్ధినిల ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. రేంజల్ ఎస్సై సాయన్న తెలిపిన వివరాల మేరకు రెంజల్ మండలం దుపల్లికి చెందిన ఇద్దరు […]

Nizamabad | మోడల్ స్కూల్ విద్యార్ధినిలు అదృశ్యం

Nizamabad |

  • ఆందోళనలో తల్లిదండ్రులు
  • గాలిస్తున్న పోలీసు బృందాలు

విధాత:ప్రతినిధి నిజామాబాద్ జిల్లా రెంజల్ మోడల్ స్కూల్ కు చెందిన ఇద్దరు విద్యార్థినిలు అదృశ్యమైన ఘటన సంఛలనంగా మారింది. పాఠశాలలో ఉండాల్సిన తమ పిల్లలు అక్కడా ఉండకా..ఇంటికి రాక ఏమైపోయి ఉంటారంటు వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు అదృశ్యమైన విద్యార్ధినిల ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.

రేంజల్ ఎస్సై సాయన్న తెలిపిన వివరాల మేరకు రెంజల్ మండలం దుపల్లికి చెందిన ఇద్దరు అమ్మాయిలు మోడల్ స్కూల్ లో పదోతరగతి చదువుతున్నారు. నిన్న ఇంటి నుండి స్కూల్ కు వెళ్లిన విద్యార్థినులు రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే రెంజల్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు మిస్సింగ్ కేస్ నమోదు చేసుకొని ఇద్దరు అమ్మాయిల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. అటు తల్లిదండ్రులు, బంధువులు కూడా తమ పిల్లల కోసం వెతుకుతున్నారు