Gunturu | అమ్మాయిల‌కు డ‌బ్బు ఆశజూపి.. న‌గ్నంగా క్షుద్ర పూజ‌లు

Gunturu | వ్యాపారంలో న‌ష్ట‌పోయిన ఓ మ‌హిళ.. పూజారి స‌హాయంతో దారుణానికి పాల్ప‌డింది. పూజారి సూచ‌న మేర‌కు ఇద్ద‌రు అమ్మాయిల‌కు డ‌బ్బు ఆశ‌జూపి, ఆ యువ‌తుల‌తో న‌గ్నంగా క్షుద్ర పూజ‌లు చేశారు. ఈ ఘ‌ట‌న గుంటూరు జిల్లాలో వెలుగు చూసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా చిలుక‌లూరిపేట‌కు చెందిన అర‌వింద అనే మ‌హిళ ప‌లు వ్యాపారాలు చేసి న‌ష్ట‌పోయింది. ఈ క్ర‌మంలో సోష‌ల్ మీడియా ద్వారా తాడికొండ మండ‌లం పొన్నెక‌ల్లుకు చెందిన పూజారి నాగేశ్వ‌ర్ రావు ప‌రిచ‌యం […]

  • Publish Date - May 15, 2023 / 11:11 AM IST

Gunturu |

వ్యాపారంలో న‌ష్ట‌పోయిన ఓ మ‌హిళ.. పూజారి స‌హాయంతో దారుణానికి పాల్ప‌డింది. పూజారి సూచ‌న మేర‌కు ఇద్ద‌రు అమ్మాయిల‌కు డ‌బ్బు ఆశ‌జూపి, ఆ యువ‌తుల‌తో న‌గ్నంగా క్షుద్ర పూజ‌లు చేశారు. ఈ ఘ‌ట‌న గుంటూరు జిల్లాలో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా చిలుక‌లూరిపేట‌కు చెందిన అర‌వింద అనే మ‌హిళ ప‌లు వ్యాపారాలు చేసి న‌ష్ట‌పోయింది. ఈ క్ర‌మంలో సోష‌ల్ మీడియా ద్వారా తాడికొండ మండ‌లం పొన్నెక‌ల్లుకు చెందిన పూజారి నాగేశ్వ‌ర్ రావు ప‌రిచ‌యం అయ్యాడు.

గుప్త నిధుల కోసం సుల‌భంగా డ‌బ్బులు సంపాదించేందుకు ప్లాన్ చేశారు. అందుకు క్షుద్ర పూజ‌లు చేయాల‌ని, అమ్మాయిల‌తో న‌గ్నంగా పూజ‌లు చేయాల‌ని నిర్ణ‌యించారు. దీంతో ఇద్ద‌రు అమ్మాయిల‌ను కావాల‌ని నాగేంద్ర అని వ్య‌క్తికి పూజారి చెప్పాడు.

నాగేంద్ర‌, అత‌ని స్నేహితుడు సురేశ్ క‌లిసి నంద్యాల జిల్లాలోని పేద కుటుంబాల‌కు చెందిన ఇద్ద‌ర‌మ్మాయిల‌కు డ‌బ్బు ఆశ జూపారు. రూ. ల‌క్ష ఇస్తామ‌ని చెప్పి.. పూజారి వ‌ద్ద‌కు తీసుకెళ్లారు. అమ్మాయిల‌తో న‌గ్నంగా క్షుద్ర పూజ‌లు చేశారు. అనంత‌రం పూజారి అనుచ‌రులు ఆ అమ్మాయిల‌పై లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డారు.

యువ‌తులు ఎదురుతిర‌గ‌డంతో.. శ‌నివారం వారిని బెదిరించి, ఓ కారులో ఎక్కించుకుని గుంటూరు వైపు బ‌య‌ల్దేరారు. గోరంట్ల స‌మీపంలో ఇద్ద‌ర‌మ్మాయిలు త‌ప్పించుకుని దిశ యాప్ ద్వారా పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. న‌ల్ల‌పాడు పోలీసులు వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని పూజారితో పాటు అత‌ని అనుచ‌రుల‌ను అదుపులోకి తీసుకున్నారు.

Latest News