Rangareddy | గంటల వ్యవధిలో ఇద్దరు భార్యలు మృతి.. శోకసంద్రంలో భర్త
Rangareddy | ఇద్దరు భార్యలు గంటల వ్యవధిలో మృతి చెందడంతో ఓ భర్త శోకసంద్రంలో మునిగిపోయాడు. తనకెవరు దిక్కంటూ రోదించాడు. కండ్ల ముందున్న కుమారుడిని చూసి బోరున విలపించాడు. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని నక్కలపల్లిలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నక్కలపల్లికి చెందిన మంగళారం అంతయ్యకు ఇద్దరు భార్యలు. పెద్ద భార్య లక్ష్మి(55)కి సంతానం కలగకపోవడంతో.. కొద్దికాలం తర్వాత చంద్రమ్మ(40)ను రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెకు కుమారుడు జన్మించాడు. అతని […]

Rangareddy |
ఇద్దరు భార్యలు గంటల వ్యవధిలో మృతి చెందడంతో ఓ భర్త శోకసంద్రంలో మునిగిపోయాడు. తనకెవరు దిక్కంటూ రోదించాడు. కండ్ల ముందున్న కుమారుడిని చూసి బోరున విలపించాడు. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని నక్కలపల్లిలో గురువారం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. నక్కలపల్లికి చెందిన మంగళారం అంతయ్యకు ఇద్దరు భార్యలు. పెద్ద భార్య లక్ష్మి(55)కి సంతానం కలగకపోవడంతో.. కొద్దికాలం తర్వాత చంద్రమ్మ(40)ను రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెకు కుమారుడు జన్మించాడు. అతని వయసు 12 సంవత్సరాలు.
అయితే ఇద్దరు భార్యలు గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధ పడుతున్నారు. గురువారం తెల్లవారుజామున రెండో భార్య చంద్రమ్మ చనిపోగా, అదే రోజు ఉదయం 7 గంటలకు పెద్ద భార్య లక్ష్మి కూడా అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయింది. ఇద్దరు భార్యలు ఒకేసారి మరణించడంతో అంతయ్య శోకసంద్రంలో మునిగిపోయాడు.
అయితే.. అంతయ్యది నిరుపేద కుటుంబం. ఆయన దగ్గర వారి దహన సంస్కారాలకు కూడా డబ్బులు లేవు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక నాయకుడు షాబాద్ దర్శన్ ఆర్థిక సాయం అందించి అంత్యక్రియలు నిర్వహించారు.