UFO సమాచారం కప్పి పుచ్చేందుకు.. ప్రాణాలు తీసిన US ప్రభుత్వం!
UFO కాంగ్రెస్ కమిటీకి వెల్లడించిన ఆ దేశ మాజీ సైనికాదికారులు గ్రహాంతర వాసులు ప్రయాణించే ఎగిరే పళ్లాలు (యూఎఫ్ఓ)ల సమాచారాన్ని కప్పిపెట్టడానికి అమెరికా (America)ప్రభుత్వం కొంతమంది పౌరులను మట్టుపెట్టిందని ఆ దేశ మాజీ సైనికాధికారులు ఇద్దరు, ఒక ఆర్మీ ఇంటెలిజెన్స్ అధికారి వెల్లడించారు. ఏలియన్‌ల సమాచారాన్ని అమెరికా ప్రభుత్వం దాచి పెడుతోందని, యూఎఫ్ఓల సాంకేతికతను వినియోగించి యుద్ధ విమానాలు తయారుచేస్తోందని వచ్చిన ఆరోపణలపై యూఎస్ కాంగ్రెస్‌కు చెందిన ద హౌస్ ఓవర్ సైట్ కమిటీ విచారణ చేస్తున్న […]

UFO
కాంగ్రెస్ కమిటీకి వెల్లడించిన ఆ దేశ మాజీ సైనికాదికారులు
గ్రహాంతర వాసులు ప్రయాణించే ఎగిరే పళ్లాలు (యూఎఫ్ఓ)ల సమాచారాన్ని కప్పిపెట్టడానికి అమెరికా (America)ప్రభుత్వం కొంతమంది పౌరులను మట్టుపెట్టిందని ఆ దేశ మాజీ సైనికాధికారులు ఇద్దరు, ఒక ఆర్మీ ఇంటెలిజెన్స్ అధికారి వెల్లడించారు. ఏలియన్‌ల సమాచారాన్ని అమెరికా ప్రభుత్వం దాచి పెడుతోందని, యూఎఫ్ఓల సాంకేతికతను వినియోగించి యుద్ధ విమానాలు తయారుచేస్తోందని వచ్చిన ఆరోపణలపై యూఎస్ కాంగ్రెస్‌కు చెందిన ద హౌస్ ఓవర్ సైట్ కమిటీ విచారణ చేస్తున్న విషయం తెలిసిందే.
డేవిడ్ గ్రుష్, ర్యాన్ గ్రేవ్స్ (మాజీ పైలట్), కమాండర్ డేవిడ్ ఫ్రేవర్ (నేవీ ఫైటర్ పైలట్)లు ఈ కమిటీ ముందు 2004 టిక్ టాక్ యూఎఫ్ఓ (UFO)ఘటనకు సంబంధించి సాక్ష్యాలు సమర్పించారు. అంతే కాకుండా ఆ ఘటనకు తాము ప్రత్యక్ష సాక్షులమని పేర్కొన్నారు. గత కొన్ని దశాబ్దాలుగా యూఎఫ్ఓల సామర్థ్యాన్ని అమెరికా ప్రభుత్వం సేకరిస్తోందని.. ఆ విషయాలను సాధారణ ప్రజల నుంచి దాస్తోందని డేవిడ్ గ్రుష్ వెల్లడించారు.
‘2004లో నేను విధుల్లో ఉండగా.. యూఎఫ్ఓ క్రాష్ గురించి విన్నాను. ఆ శకలాలను సేకరించి.. వాటిని రివర్స్ ఇంజినీరింగ్ చేశారని నాకు తెలుసు. అప్పుడు నేను సేకరించిన ఆధారాలను మా ఉన్నతాధికారులకు కూడా అందించాను’ అని ఆయన తెలిపారు. ఆ సాంకేతికతను అభివృద్ధి చేస్తూ పోతే.. కొన్నిరోజులకు అది మానవాళికి ముప్పుగా మారుతుందని అందుకనే కమిటీకి ఈ విషయాలను వెల్లడించానని పేర్కొన్నారు.
ప్రభుత్వం ఎవరినైనా చంపడం గురించి నీకు నేరుగా తెలుశా అని కమిటీ ప్రశ్నించగా … ఆ సాక్షుల వివరాలను మీకు ఇస్తానని గ్రుష్ సమాధానం ఇచ్చారు. అయితే యూఎఫ్ఓ ల వెంట వెళ్లడం వల్ల కానీ.. వాటి రివర్స్ ఇంజినీరింగ్ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల కానీ తన సహోద్యోగ్యులు గాయపడటం ప్రత్యక్షంగా చూశానని చెప్పారు.
యూఎప్ఓ సాంకేతికతను అమెరికా ఏదైనా యుద్ధ విమానంలో ఉపయోగించిందా అని కమాండర్ డేవిడ్ ఫ్రేవర్‌ను కమిటీ ప్రశ్నించింది. దీనికి ఆయన అంత శక్తిమంతమైన విమానం అమెరికా వద్ద ఉందని తాను అనుకోవడం లేదని సమాధానమిచ్చారు. అవి ఎలా ఎగురుతాయో ఆయన కళ్లకు కట్టినట్టు వివరించారు. ‘2004లో మేము సముద్రంలో విధుల్లో ఉండగా .. సుమారు 80 వేల అడుగుల ఎత్తు నుంచి ఒక వస్తువు కిందకి దిగడం గమనించాం.
అది అప్పటికి అత్యాధునికమైన ఎఫ్ – 18 ఎగరగలిగే దాని కన్నా రెట్టింపు ఎత్తు. ఆ వస్తువును తమ స్క్వాడ్రన్‌కు చెందిన విమానం వెంబడించగా.. ఆ యూఎఫ్ఓ మా విమానం కన్నా మూడు రెట్లు అధిక వేగంతో దూసుకుపోయింది, అని గుర్తు చేసుకున్నారు. మరోసారి 2009లో ఇండోనేసియాలో గస్తీకి వెళ్లినపుడు తాను, మరో ఐదుగురు సహోద్యోగులు ఒక ఎగిరే పళ్లాన్ని ప్రత్యక్ష్యంగా చూశామని కమిటీ ముందు పేర్కొన్నారు.