సీఏఏ వల్ల ఎవరికీ నష్టం ఉండదు.. ముస్లింలు కూడా అర్హులే: కేంద్రమంత్రి అమిత్‌షా
సీఏఏపై బీజేపీ అగ్రనేత, కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరమైన డాక్యుమెంట్స్ లేని ముస్లిమేతరకు ఎలాంటి నిబంధనలు లేవన్నారు

విధాత: సీఏఏపై బీజేపీ అగ్రనేత, కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరమైన డాక్యుమెంట్స్ లేని ముస్లిమేతరకు ఎలాంటి నిబంధనలు లేవన్నారు. 85శాతం మంది వద్ద సరైన పత్రాలు ఉన్నాయని, వారిని వెంటనే గుర్తించాలన్నారు. ముస్లిమేతరులు మాత్రమే కాకుండా ముస్లింలు సైతం సీఏఏకు అప్లై చేసుకోవచ్చాన్నారు. సరైన పత్రాలు లేని వారికి కూడా త్వరలోనే ప్రభుత్వం ప్రత్యాన్మయం ఏర్పాటు చేస్తోందన్నారు. సీఏఏ ముస్లింలకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన చట్టం కాదన్నారు.
పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్థాన్‌లలో హింసించబడ్డ మైనారిటీలకు 11 సంవత్సరాల నిబంధన తగ్గించి 5సంవత్సరాలకు కుదించాలని కేంద్రం సీఏఏకు తెలిపింది. డిసెంబర్2014 కంటే ముందు భారత్‌లోకి ప్రవేశించిన వారందరూ గుర్తింపు ఉన్న దేశాల నుంచి వచ్చిన డాక్యుమెంట్స్ చూపిస్తే సరిపోతుందన్నారు. రాజ్యాంగం ప్రకారం అందరు ఈ చట్టాన్ని ఉపయోగించుకోవచ్చాన్నారు. అన్యాయంగా తమ పౌర సత్వాన్ని రద్దు చేస్తారన్న అపోహలతో కొందరు నిరసనలు చేస్తున్నారని, ఎవరికి అన్యాయం జరగదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
2019లోనే ఈ చట్టం ఉభయ సభల్లో ఆమోదం పొందిందన్నారు. కోవిడ్ మూలంగా అమలు చేయడంలో జాప్యం కలిగిందన్నారు. ప్రతి పక్షాలు ఆరోపించే విధంగా ఎన్నికల కోసం ఈ చట్టాన్ని ముందుకు తీసుకు వస్తుందన్న దానిలో ఏమాత్రం నిజం లేదని అమిత్‌షా కొట్టి పారేశారు.