Musi River | మూసీ నది ప్రక్షాళనపై.. ప్రతిపాదన లేదు: కేంద్ర మంత్రి
Musi River పార్లమెంటులో కేంద్ర మంత్రి స్పష్టీకరణ విధాతః హైదరాబాద్ మూసీ నది కాలుష్య నివారణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం వద్ధ ఎలాంటి ప్రతిపాదన లేదని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ స్పష్టం చేశారు. అలాగే మూసీ నదిపై స్కైవే నిర్మాణానికి సంబంధించి కూడా తమకు తెలంగాణ ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రతిపాదన అందలేదని షెకావత్ తేల్చిచెప్పారు. బీఆరెస్ ఎంపీలు గడ్డం రంజిత్‌రెడ్డి, మాలోతు కవితలు అడిగిన ప్రశ్నలకు పార్లమెంటులో షెకావత్ లిఖిత పూర్వక […]

Musi River
- పార్లమెంటులో కేంద్ర మంత్రి స్పష్టీకరణ
విధాతః హైదరాబాద్ మూసీ నది కాలుష్య నివారణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం వద్ధ ఎలాంటి ప్రతిపాదన లేదని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ స్పష్టం చేశారు. అలాగే మూసీ నదిపై స్కైవే నిర్మాణానికి సంబంధించి కూడా తమకు తెలంగాణ ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రతిపాదన అందలేదని షెకావత్ తేల్చిచెప్పారు. బీఆరెస్ ఎంపీలు గడ్డం రంజిత్‌రెడ్డి, మాలోతు కవితలు అడిగిన ప్రశ్నలకు పార్లమెంటులో షెకావత్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.
2018సెప్టెంబర్ నాటికి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నివేదిక మేరకు తెలంగాణలోని హైద్రాబాద్ నుండి నల్లగొండ వరకు ఉన్న మూసీనదిని మొదటి ప్రాధన్యతలో, 2022నవంబర్ నివేదిక మేరకు బాపుఘాట్ నుండి రుద్రవెల్లి వరకు, కాసాని గూడెం నుండి వలిగొండ వరకు ఉన్న మూసీ నదిని రెండో ప్రాధాన్యత క్రింద గుర్తించినట్లుగా కేంద్రం వెల్లడించింది.