మరోసారి సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రుల ఢిల్లీ పర్యటన
సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటన. కాంగ్రెస్ హైకమాండ్‌తో భేటీ, రాష్ట్ర రాజకీయాలు, ప్రాజెక్టులపై కీలక చర్చలు.
విధాత, హైదరాబాద్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సహా మంత్రులు, ముఖ్య నేతలు గురువారం ఢిల్లీలో కాంగ్రెస్ హై కమాండ్ తో భేటీ కానున్నారు. వారంతా తమ ఢిల్లీ పర్యటనలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తో భేటీ కానున్నట్లుగా సమాచారం. ఈ భేటీలో రాష్ట్ర రాజకీయ పరిణామాలు, మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణ, మంత్రి విస్తరణ లేదా పునర్ వ్యవస్థీకరణ, నామినేటెడ్ పదవులు వంటి కీలక అంశాలపై చర్చించనున్నట్లుగా తెలుస్తుంది. అయితే సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్లడం 63వసారి కావడం గమనార్హం.
మధ్యాహ్నం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సచివాలయంలో మున్సిపల్ శాఖపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష అనంతరం సీఎం రేవంత్ రెడ్డి రాత్రికి శంషాబాద్ విమానాశ్రయం నుండి ముంబైకి బయలుదేరతారు. రేపు (ఫిబ్రవరి 18) ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనున్న ప్రతిష్టాత్మక ‘క్లైమేట్ వీక్’ సదస్సులో ఆయన పాల్గొంటారు. అంతర్జాతీయ స్థాయిలో పర్యావరణ పరిరక్షణ, గ్రీన్ ఎనర్జీ, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై జరుగుతున్న ఈ చర్చల్లో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పర్యావరణ హిత కార్యక్రమాలపై ఆయన ప్రసంగిస్తారు.
ముంబై పర్యటన ముగిసిన వెంటనే అటు నుంచే రేపు బుధవారం సాయంత్రం రేవంత్ రెడ్డి నేరుగా ఢిల్లీకి పయనమవుతారు. 19వ తేదీ గురువారం ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఏఐ సమ్మిట్ కు హాజవుతారు. ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్దికి సంబంధించిన అంశాలపై మరోసారి పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించి కేంద్రం నుండి లభించాల్సిన అనుమతులు, పెండింగ్ ప్రాజెక్టులు, మున్ననూరు విమానాశ్రయం పనులు, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక, ఆర్థిక సహకారంపై ఆయన చర్చించనున్నట్లుగా సమాచారం.
ఇవి కూడా చదవండి :
Lukewarm Water | గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల కలిగే లాభాలు తెలుసా..?
Pratyusha | ప్రత్యూష ఆత్మహత్య కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు .. సిద్ధార్థ్ రెడ్డి లొంగిపోవాలని ఆదేశాలు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram