Kishan Reddy | తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కిషన్‌రెడ్డి

Kishan Reddy హాజరైన పార్టీ ప్రముఖులు విధాతః బీజేపీ తెలంగాణ శాఖ నూతన అధ్యక్షుడిగా నియామితులైన కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో తన బాధ్యతలు స్వీకరించారు. బండి సంజయ్ నుండి కిషన్‌రెడ్డి పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. కిషన్‌రెడ్డి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా రెండు పర్యాయాలు, తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఒకసారి పనిచేయగా, మరో సారి ఆయన తెలంగాణ రాష్ట్ర శాఖ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు […]

  • By: Somu    latest    Jul 21, 2023 12:57 AM IST
Kishan Reddy | తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కిషన్‌రెడ్డి

Kishan Reddy

  • హాజరైన పార్టీ ప్రముఖులు

విధాతః బీజేపీ తెలంగాణ శాఖ నూతన అధ్యక్షుడిగా నియామితులైన కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో తన బాధ్యతలు స్వీకరించారు. బండి సంజయ్ నుండి కిషన్‌రెడ్డి పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. కిషన్‌రెడ్డి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా రెండు పర్యాయాలు, తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఒకసారి పనిచేయగా, మరో సారి ఆయన తెలంగాణ రాష్ట్ర శాఖ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం విశేషం.

గన్‌పార్కు అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి ర్యాలీగా రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వచ్చిన కిషన్‌రెడ్డి తెలంగాణ రాష్ట్ర శాఖ నూతన అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ శాలువ కప్పి సన్మానించారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర పార్టీ ఇంచార్జీలు ప్రకాశ్ జవదేకర్‌, తరుణ్ చుగ్‌, బన్సల్‌, జాతీయ ఉపాధ్యక్షులు డికే అరుణ, మురళీధర్‌రావు, మాజీ సీఎం ఎన్‌. కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్‌, రఘునందన్ రవు, విజయశాంతి, ఎంపీలు డి.అరవింద్‌, సోయం బాపురావు, రవిందర్ నాయక్‌, మాజీ ఎంపీలు జి.వివేక్‌, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డిలతో పాటు పార్టీ ముఖ్య నేతలు, జిల్లాల నాయకులు భారీ సంఖ్యలో హాజరై కిషన్‌రెడ్డికి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయా నాయకులు మాట్లాడుతు కిషన్‌రెడ్డి నాయకత్వంలో పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేయగా, మరికొందరు ఏకంగా కిషన్‌రెడ్డి తదుపరి తెలంగాణ సీఎం అవుతారంటు జోస్యం చెప్పారు