Mahendra Nath Pandey | మోడీ పాలనలో దేశాభివృద్ధి: కేంద్ర మంత్రి మహేంద్రనాథ్

విధాత : ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలనలో దేశం అంతకు ముందు ఎన్నడూ లేని విధంగా అన్ని రంగాలలో అభివృద్ధి సాధించిందని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండే (Union Minister Mahendra Nath Pandey ) అన్నారు. బిజెపి దేశవ్యాప్తంగా చేపట్టిన మోడీ తొమ్మిదేళ్ల పాలన విజయాల ప్రచార కార్యక్రమం మహాజన సంపర్క్ అభియాన్‌లో భాగంగా పాండే శనివారం నల్గొండలో వివిధ వర్గాల ప్రజలతో, మీడియాతో భేటీ అయ్యారు. […]

  • By: krs    latest    Jun 10, 2023 10:21 AM IST
Mahendra Nath Pandey | మోడీ పాలనలో దేశాభివృద్ధి: కేంద్ర మంత్రి మహేంద్రనాథ్

విధాత : ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలనలో దేశం అంతకు ముందు ఎన్నడూ లేని విధంగా అన్ని రంగాలలో అభివృద్ధి సాధించిందని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండే (Union Minister Mahendra Nath Pandey ) అన్నారు. బిజెపి దేశవ్యాప్తంగా చేపట్టిన మోడీ తొమ్మిదేళ్ల పాలన విజయాల ప్రచార కార్యక్రమం మహాజన సంపర్క్ అభియాన్‌లో భాగంగా పాండే శనివారం నల్గొండలో వివిధ వర్గాల ప్రజలతో, మీడియాతో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా పాండే మాట్లాడుతూ.. 2014 ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాలనా పగ్గాలు చేపట్టే నాటికి గత ప్రభుత్వాల హాయం నుండి వచ్చిన అనేక సమస్యలు, సవాళ్లను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ దేశాన్ని ముందుకు నడిపించారన్నారు. సుపరిపాలన, పేదల సంక్షేమం, దేశ భద్రత, అందరి అభివృద్ధి లక్ష్యంగా పనిచేసి అన్ని రంగాల్లో రికార్డు విజయాలను మోడీ ప్రభుత్వం సాధించిందన్నారు.

రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కుటుంబ అవినీతి పాలనకు వచ్చే ఎన్నికల్లో బిజెపి చరమగీతం పాడుతుందన్నారు. కేసీఆర్ పార్టీకి బిజెపినే ప్రత్యామ్నాయమన్నారు మహిళలకు బిజెపి చట్టసభలలో మెరుగైన అవకాశాలు కల్పిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ బండారు ప్రసాద్, రాష్ట్ర నాయకులు బంగారు శృతి, ఆర్. ప్రదీప్ కుమార్, నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, మాదగోని శ్రీనివాస్ గౌడ్, పోతేపాక సాంబయ్య, కన్మంత రెడ్డి శ్రీదేవి, నాగం వర్షిత్ రెడ్డి, బొజ్జ శేఖర్, నిమ్మల రాజశేఖర్ రెడ్డి, మీడియా కన్వీనర్ కంకణాల నాగిరెడ్డి, పాలకూరి రవి తదితరులు పాల్గొన్నారు.