UP | యూపీలో దారుణం.. కండ్లు పీకి.. త‌ల‌ను ఛిద్రం చేసి! ఆరేండ్ల బాలుడిపై.. డ్ర‌గ్ ఎడిక్ట్ అరాచ‌కం

UP ఆరేండ్ల బాలుడిపై.. డ్ర‌గ్ ఎడిక్ట్ మైన‌ర్ అరాచ‌కం యూపీలోని రామ్‌ఫూర్ జిల్లాలో దారుణం విధాత‌: మ‌ద్యం, డ్ర‌గ్స్ మ‌త్తులో జ‌రిగే దారుణాలు రోజురోజుకు శృతి మించిపోతున్నాయి. డ్ర‌గ్స్‌కు బానిస అయిన ఓ బాలుడు ర‌క్ష‌సుడిగా ప్ర‌వ‌ర్తించారు. ఆరేండ్ల బాలుడిని అత్యంత దారుణంగా చంపేశాడు. కండ్లు పీకి పారేశాడు. ఇటుక‌తో త‌ల‌పై 20 సార్లు కొట్టి ఛిద్రం చేశాడు. బాలుడి దుస్తులు కూడా చింపేశాడు. ఈ భ‌యాన‌క ఘ‌ట‌న ఆదివారం యూపీలో వెలుగుచూసింది. పోలీసులు, స్థానికుల వివ‌రాల […]

UP | యూపీలో దారుణం.. కండ్లు పీకి.. త‌ల‌ను ఛిద్రం చేసి! ఆరేండ్ల బాలుడిపై.. డ్ర‌గ్ ఎడిక్ట్ అరాచ‌కం

UP

  • ఆరేండ్ల బాలుడిపై.. డ్ర‌గ్ ఎడిక్ట్ మైన‌ర్ అరాచ‌కం
  • యూపీలోని రామ్‌ఫూర్ జిల్లాలో దారుణం

విధాత‌: మ‌ద్యం, డ్ర‌గ్స్ మ‌త్తులో జ‌రిగే దారుణాలు రోజురోజుకు శృతి మించిపోతున్నాయి. డ్ర‌గ్స్‌కు బానిస అయిన ఓ బాలుడు ర‌క్ష‌సుడిగా ప్ర‌వ‌ర్తించారు. ఆరేండ్ల బాలుడిని అత్యంత దారుణంగా చంపేశాడు. కండ్లు పీకి పారేశాడు. ఇటుక‌తో త‌ల‌పై 20 సార్లు కొట్టి ఛిద్రం చేశాడు. బాలుడి దుస్తులు కూడా చింపేశాడు. ఈ భ‌యాన‌క ఘ‌ట‌న ఆదివారం యూపీలో వెలుగుచూసింది.

పోలీసులు, స్థానికుల వివ‌రాల ప్ర‌కారం.. యూపీలోని రామ్‌పూర్ జిల్లా కేంద్రానికి చెందిన యోగేంద్ర యాద‌వ్ ఇంజినీర్‌. ఆయ‌న ఒక్క‌గానొక్క‌ ఆరేండ్ల కుమారుడు యుగ్ యాదవ్ త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా శ‌నివారం ఉద‌యం 10 గంటల ప్రాంతంలో చాకెట్లు కొనేందుకు బ‌య‌ట‌కు వెళ్లాడు. కానీ, తిరిగి రాలేదు.

త‌ల్లిదండ్రులు చుట్టుప‌క్క‌ల ఎక్క‌డ వెతికినా ఆచూకీ ల‌భించ‌లేదు. దాంతో యోగేంద్ర పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. సాంకేతికంగా బాలుడి మొబైల్ లొకేష‌న్ ట్రేస్ చేయ‌గా, కాల‌నీ ప‌రిధి దాటి వెళ్ల‌లేద‌ని తేలింది.

ఆదివారం సాయంత్రం ఎన్‌హెచ్‌-87 స‌మీపంలో నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్ స్థలంలో బాలుడి మృత‌దేహం ల‌భించింది. కండ్లు పీకేసి, ఇటుక‌తో ప‌లుమార్లు త‌ల‌పై కొట్టి ఛిద్రం చేసిన స్థితిలో బాలుడి మృత‌దేహాన్ని పోలీసులు కనుగొన్నారు. డ్రగ్స్‌కు బానిసైన అదే పరిసరాల్లో ఉంటున్న13 ఏడ్ల బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్ర‌శ్నించారు.

బాలుడు యుగ్ త‌న‌ను ఎగ‌తాళి చేశాడ‌ని, డ్ర‌గ్స్ మ‌త్తులో కోపంతో అత‌డిని చంపేశాన‌ని నిందితుడు నేరాన్ని అంగీక‌రించాడు. హ‌త్య‌కు ఉప‌యోగించిన ఆయుధం, బాలుడి దుస్తుల‌ను పోలీసులు గుర్తించారు. నిందితుడు స్కూల్ డ్రాపౌట్. డ్ర‌గ్స్‌కు బానిస‌య్యాడు. నిందితుడు తన తల్లితో కలిసి ఉంటూ డ్రగ్స్ కొనేందుకు ఇటీవల సైకిల్‌ను దొంగిలించాడు. అతను కొంతమంది వ్యక్తులపై కూడా గ‌తంలో రాళ్లతో దాడి చేశాడు. ఈ ఘ‌ట‌న‌పై నిందితుడి త‌ల్లి పోలీసుల‌కు కూడా ఫిర్యాదు చేసింది.

తాజా హ‌త్య ఘ‌ట‌న‌పై నిందితుడిపై IPC సెక్షన్లు 302 (హత్య), 201 (సాక్ష్యం అదృశ్యం చేయడం) కింద కేసు నమోదు చేశామ‌ని పోలీసులు తెలిపారు. అత‌డిని జువైనల్ హోమ్‌కు పంపుతామ‌ని వెల్ల‌డించారు. రామ్‌పూర్ ప్రాంతంలో రెండునెల‌ల వ్య‌వ‌ధిలో ఇదే త‌ర‌హాలో దారుణంగా హ‌త్య జ‌రుగ‌డం ఇది రెండో సారి