వేలం త‌ర్వాత చాలా స్ట్రాంగ్‌గా క‌నిపిస్తున్న స‌న్ రైజర్స్.. ఈ 11 మంది ఉంటే క‌ప్ మ‌న‌దే..!

వేలం త‌ర్వాత చాలా స్ట్రాంగ్‌గా క‌నిపిస్తున్న స‌న్ రైజర్స్.. ఈ 11 మంది ఉంటే క‌ప్ మ‌న‌దే..!

వ‌చ్చే ఏడాది ఐపీఎల్ జ‌ర‌గ‌నుండ‌గా, రీసెంట్‌గా మిని వేలం జ‌రిగింది. ఇందులో విదేశీ ఆట‌గాళ్లు ఎక్కువ రేటుకి అమ్ముడుపోయారు. ఐపీఎల్ 2024 వేలంలో తెలుగు ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ సత్తా చాటడం విశేషం. గతంలో కంటే దూకుడుగా వ్యవహరించి కొంత మంది కీలక ప్లేయర్లను సొంతం చేసుకుంది. జట్టులో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలను బ్యాలెన్స్ చేయడానికి స్ట్రాంగ్ ప్లేయర్స్‌ను వేలంలో దక్కించుకోవ‌డం విశేషం. చాలా ఏళ్లుగా స‌న్‌రైజ‌ర్స్ అంత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర‌చ‌డం లేదు. కెప్టెన్స్ మారిన కూడా ఆ జ‌ట్టు ఎందుకు విజ‌య‌తీరాల‌కి చేర‌డం లేదు. దీంతో ఈ సారి వేలంలో గ‌ట్టి ఆట‌గాళ్ల‌నే ద‌క్కించుకున్నారు. 2023 ప్రపంచ కప్ గెలిచిన ఆస్ట్రేలియా టీమ్ మెంబర్స్ ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్ ల‌ని ద‌క్కించుకొని జ‌ట్టుని మ‌రింత ప‌టిష్టంగా మార్చుకున్నారు.

బౌలింగ్ విభాగంలో కూడా ఎస్ఆర్హెచ్ చాలా స్ట్రాంగ్ అయిన‌ట్టు క‌నిపిస్తుంది. శ్రీలంక లెగ్ స్పిన్నర్ వనిందు హసరంగ, భారత పేసర్ జయదేవ్ ఉనద్కత్‌ను దక్కించుకోవడంతో పాటు ఇండియన్ బౌలర్లు ఆకాష్ సింగ్, ఝాతవేద్ సుబ్రమణ్యన్‌ ఇద్దరినీ నామమాత్రపు ధరకు సొంతం చేసుకుంది. మొత్తానికి ఎస్ఆర్ హెచ్ త‌ర‌పున బ్యాటర్స్: అబ్దుల్ సమద్, ఐడెన్ మార్క్రామ్ (SA), రాహుల్ త్రిపాఠి, మయాంక్ అగర్వాల్, ట్రావిస్ హెడ్ (AUS), అన్మోల్‌ప్రీత్ సింగ్ ఉండ‌గా, బౌల‌ర్స్‌లో భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సెన్ (SA), ప్యాట్ కమిన్స్ (AUS), T. నటరాజన్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, వనిందు హసరంగా (SL), జయదేవ్ ఉనద్కత్, ఆకాష్ సింగ్, ఫజల్ హాక్ ఫరూకీ (AFG), జాతవేద్ సుబ్రమణ్యన్ ఉన్నారు. ఇక ఆల్‌రౌండ‌ర్స్‌గా వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ, షాబాజ్ అహ్మద్, సన్వీర్ సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, వికెట్ కీపర్లు: గ్లెన్ ఫిలిప్స్ (NZ), ఉపేంద్ర సింగ్ యాదవ్, హెన్రిచ్ క్లాసెన్ (SA) ఉన్నారు.

అయితే ఎస్ఆర్హెచ్ త‌ర‌పున 2024లో ఫైర‌ల్ ఎల‌వెన్‌లో మయాంక్ అగర్వాల్, ట్రావిస్ హెడ్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్‌క్రామ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమద్/ఉపేంద్ర యాదవ్, ప్యాట్ కమిన్స్, వాషింగ్టన్ సుందర్/షహబాజ్ అహ్మద్, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్, భువనేశ్వర్ కుమార్ ఉంటే మాత్రం టీం మాములుగా ఉండ‌ద‌ని, కప్ కొట్టే స‌త్తా ఈ టీమ్‌కి ఉంద‌ని కొంద‌రు చెప్పుకొస్తున్నారు. హెడ్ చేరిక‌తో టీం చాలా స్ట్రాంగ్ అయింది. బ్యాటింగ్‌తో పాటు స్పిన్ బౌలింగ్ కూడా అద్భుతంగా చేయ‌గ‌ల‌డు.