Naini Coal Mine Tenders | నైనీ కోల్ మైన్ వివాదంలో సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రం షాక్
సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రం షాక్! సింగరేణి నైనీ టెండర్లతో పాటు 'మెస్సీ' ఈవెంట్ నిధులపై కేంద్ర విచారణ. 3 రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశం
విధాత, హైదరాబాద్ : సింగరేణి నైనీ కోల్ మైన్ టెండర్ల రద్దు, అక్రమాల వివాదంలో విచారణ జరుపాలని ద్విసభ్య కమిటీని నియమించిన కేంద్ర బొగ్గు గనుల శాఖ..అనూహ్యంగా అదే ఉత్తర్వులలో సీఎం రేవంత్ రెడ్డిని ఇరుకున పెట్టేలా కీలక ఆదేశాలు ఇచ్చింది.
ఒకవైపు కోల్ మైన్ టెండర్ల దందాలపై విచారణ జరపమని ఆదేశించిన కేంద్రం..సీఎం రేవంత్ రెడ్డి మెస్సీ ఫుట్ బాల్ ఈవెంట్ కోసం సింగరేణి సీఎస్ఆర్( CSR) నిధులను వినియోగించడాన్ని దుర్వినియోగంగా పరిగణించి ఈ వ్యవహారంపై కూడా విచారణ చేయాలని ద్విసభ్య కమిటీకి సూచించడం ఆసక్తికరంగా మారింది.
ఇటీవల మెస్సీ ఫుట్ బాల్ ఈవెంట్ నిర్వహణ కోసం రూ. 10 కోట్ల సింగరేణి నిధులను ఖర్చు చేశారు. ఇదే కాకుంగా మరికొన్ని ప్రభుత్వ స్కీమ్ ల పేరుతో చేపట్టిన కార్యక్రమాల కోసం సింగరేణి సీఎస్ఆర్ ఫండ్స్ నిధుల దుర్వినియోగం జరిగిందనే కారణంతో వాటిపై కూడా విచారణ చేసి 3 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కేంద్రం విచారణ కమిటీని ఆదేశించడం గమనార్హం. ద్విసభ్య విచారణ కమిటీలో కేంద్ర బొగ్గు శాఖ, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ చేతనా శుక్లా, డైరెక్టర్ టెక్నికల్ మారపల్లి వెంకటేశ్వర్లు సభ్యులుగా ఉన్నారు.

ఇవి కూడా చదవండి :
అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల హక్కులు మీకు తెలుసా?
KTR SIT Investigation | ఫోన్ ట్యాపింగ్ బ్లాక్ మెయిల్ తో ఎలక్ట్రోరల్ బాండ్లు : కేటీఆర్ కు సిట్ ప్రశ్నలు?
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram