Naini Coal Block Tender | నైని బొగ్గు గనుల రద్దుపై విచారణ కమిటీ వేసిన కేంద్రం

నైని బొగ్గు గనుల టెండర్ల రద్దుపై కేంద్రం సీరియస్! ద్విసభ్య కమిటీతో విచారణకు ఆదేశం. సింగరేణి నిర్ణయం వెనుక కారణాలపై 3 రోజుల్లో నివేదిక కోరిన బొగ్గు మంత్రిత్వ శాఖ..

Naini Coal Block Tender | నైని బొగ్గు గనుల రద్దుపై విచారణ కమిటీ వేసిన కేంద్రం

నైని బొగ్గు గనుల టెండర్లలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో సింగరేణి సంస్థ నైని కోల్ బ్లాక్ టెండర్ రద్దుకు నిర్ణయం తీసుకుంది. అయితే టెండర్ రద్దుకు గల కారణాలపై విచారణ జరుపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ద్విసభ్య విచారణ కమిటీని నియమించింది. కమిటీలో కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ చేతన్ శుక్లా, కోల్ డైరెక్టర్ మర్పల్లి వెంకటేశ్వర్లు సభ్యులుగా ఉన్నారు. ద్విసభ్య కమిటీ సీసీఎల్ ను సందర్శించి టెండర్ల రద్దుకు దారితీసిన కారణాలపై విచారణ చేపట్టనుంది. మూడు రోజుల్లో నివేదిక సమర్పించాలని కేంద్రం ఆదేశించింది.

ఇవి కూడా చదవండి :

TVK Vijay | విజయ్ పార్టీ టీవీకే ఎన్నికల సింబల్ ‘విజిల్‌’

286 kg Golden Bow Gifted To Ayodhya Ram | ఆయోధ్య రాముడికి అరుదైన ‘పంచలోహ ‘విల్లు’