UP | పెళ్లికి పిల్ల దొరకట్లేదని.. శివలింగాన్ని అపహరించిన భక్తుడు..
UP | విధాత: పెళ్లి కానీ ప్రసాదులు ఈ భూమ్మీద ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారు తమకు ఓ పెళ్లి కూతురిని ప్రసాదించు భగవంతుడా.. అని కనిపించిన దేవుడినల్లా మొక్కుతుంటారు. అంతే కాదు పెళ్లయ్యే వరకు పూజలు, వ్రతాలు చేస్తూనే ఉంటారు. అవసరమైతే దేవుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి, తమ కోరికలను తీర్చమని వేడుకుంటుంటారు. ఆ మాదిరిగానే ఓ యువకుడు తనకు ఓ పెళ్లి కూతుర్ని ప్రసాదించమని దేవుడిని వేడుకున్నాడు. కానీ ఆ దేవుడు కనికరించకపోయేసరికి, […]
UP |
విధాత: పెళ్లి కానీ ప్రసాదులు ఈ భూమ్మీద ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారు తమకు ఓ పెళ్లి కూతురిని ప్రసాదించు భగవంతుడా.. అని కనిపించిన దేవుడినల్లా మొక్కుతుంటారు. అంతే కాదు పెళ్లయ్యే వరకు పూజలు, వ్రతాలు చేస్తూనే ఉంటారు. అవసరమైతే దేవుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి, తమ కోరికలను తీర్చమని వేడుకుంటుంటారు.
ఆ మాదిరిగానే ఓ యువకుడు తనకు ఓ పెళ్లి కూతుర్ని ప్రసాదించమని దేవుడిని వేడుకున్నాడు. కానీ ఆ దేవుడు కనికరించకపోయేసరికి, ఏకంగా శివలింగాన్ని అపహరించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కౌశంభి జిల్లాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. కౌశంభి జిల్లాకు చెందిన చోటూ అనే యువకుడికి పెళ్లి కాలేదు. దీంతో స్థానికంగా ఉన్న భైరవ బాబా టెంపుల్‌కు వెళ్లి.. తనకు ఓ మంచి అమ్మాయిని ప్రసాదించమని ప్రార్థించాడు చోటూ. నెల రోజుల పాటు ప్రత్యేక పూజలు చేశాడు. కానీ దేవుడు కనికరించలేదు.
దీంతో ఆగస్టు 31వ తేదీన ఆలయానికి వచ్చిన చోటూ.. శివలింగాన్ని అపహరించాడు. మరుసటి రోజు పొద్దున్నే గుడికి వచ్చిన భక్తులు.. శివలింగం కనిపించకపోయేసరికి పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. విచారణ చేపట్టారు. చోటూనే శివలింగాన్ని అపహరించి ఉంటాడని భావించిన పోలీసులు, అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. తనకు పెళ్లి చేసుకునేందుకు అమ్మాయి దొరక్కపోవడంతోనే.. దేవుడిపై విసుగుపుట్టి.. శివలింగాన్ని అపహరించానని తెలిపాడు.
ఆలయానికి సమీపంలో ఉన్న చెట్ల పొదల్లో శివలింగాన్ని దాచిపెట్టినట్లు ఒప్పుకున్నాడు. అనంతరం శివలింగాన్ని స్వాధీనం చేసుకుని, ఆలయంలో ప్రతిష్టించి పూజలు చేశారు. చోటూ ప్రతి రోజు సాయంత్రం గుడికి వచ్చేవాడని భక్తులు పేర్కొన్నారు.
X



Google News
Facebook
Instagram
Youtube
Telegram