పట్టపగలు, నడిరోడ్డుపై మహిళను.. గొడ్డలితో నరికి చంపిన అన్నదమ్ములు
ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణంగా జరిగింది. ఇద్దరు అన్నదమ్ములు పట్టపగలు, నడిరోడ్డుపై మహిళను గొడ్డలితో నరికి దారుణంగా చంపేశారు
- జైలు నుంచి బెయిల్‌పై వచ్చి ఘాతుకం
- మైనర్‌గా ఉన్నప్పుడే బాధితురాలిపై రేప్
- కేసు ఉపసంహరించుకోవాలని ఒత్తిడి
- వినకపోవడంతో దారి కాచి దారుణంగా హత్య
- యూపీలో మళ్లీ రెచ్చిపోతున్న నేరస్థులు
విధాత: ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణంగా జరిగింది. ఇద్దరు అన్నదమ్ములు పట్టపగలు, నడిరోడ్డుపై మహిళను గొడ్డలితో నరికి దారుణంగా చంపేశారు. వివిధ నేరాలు చేసి జైలు పాలైన అశోక్, పవన్ నిషాద్ ఇటీవలే బెయిల్‌పై విడుదలై ఈ ఉన్మాదానికి పాల్పడ్డాడు. ఈ ఘటన యూపీలోని కౌశాంబి జిల్లాలో మంగళవారం ఉదయం చోటుచేసుకున్నది. పరారీలో ఉన్న వీరిద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
పోలీసులు వివరాల ప్రకారం.. కౌశాంబి జిల్లాలోని దెర్హా గ్రామానికి చెందిన అశోక్, పవన్ నిషాద్ అన్నదమ్ములు. మంగళవారం ఉదయం గ్రామంలోని ప్రధాన రహదారిపై పట్టపగలు 19 ఏళ్ల మహిళను వీరిద్దరు గొడ్డలితో నరికి చంపారు. హంతకులు ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యారు.
హత్యకు గురైన మహిళ మూడేండ్ల క్రితం మైనర్‌గా ఉన్నప్పుడు పవన్ నిషాద్ ఆమెపై లైంగికదాడి చేశాడు. రేప్ ఘటనలో పవన్‌తోపాటు అతడి సహచరులపై బాధితురాలు పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని అప్పటి నుంచి ఆ మహిళను వేధిస్తున్నాడు.
थाना महेवाघाट के ढेरहा गांव मे एक ही बिरादरी के दो पक्षों के बीच में पुरानी रंजिश और मुकदमेबाजी को लेकर आपस में विवाद हुआ जिसमे एक पक्ष के लोगों द्वारा दूसरे पक्ष की 20 वर्षीय युवती की धारदार हथियार से हमला कर हत्या कर दी गई है। प्रकरण में पुलिस अधीक्षक कौशाम्बी द्वारा दी गई बाइट pic.twitter.com/ve8TBRw5jv
— KAUSHAMBI POLICE (@kaushambipolice) November 21, 2023
పవన్ సోదరుడు అశోక్ నిషాద్ కూడా ఒక హత్య కేసులో నిందితుడు. యువతి హత్యకు రెండు రోజుల ముందు విడుదలయ్యాడు. పవన్ జైలు నుంచి బయటికి రావడంతో ఇద్దరు కలిసి మహిళ కుటుంబీకులను కొట్టి బెదిరించి కేసు ఉపసంహరించుకోవాలని హెచ్చరించారు.
యువతి వెనక్కి తగ్గడానికి నిరాకరించింది. మంగళవారం యువతి సైకిల్‌పై వస్తుండగా, నిందితులు ఇద్దరు బైక్‌పై వచ్చి ఆమెను ఢీకొట్టి రోడ్డుపై పడగా, గొడ్డలితో నరికి చంపారు. అశోక్ నిషాద్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. నిందితులపై కేసు నమోదు చేశామని కౌశాంబి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బ్రిజేష్ శ్రీవాస్తవ అన్నారు.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం.. యూపీలో 2021లో మహిళలపై 56,000కి పైగా నేరాల కేసులు నమోదయ్యాయి. ఇది దేశంలో అత్యధిక నేరాలు నమోదైన రాష్ట్రంగా రికార్డు కెక్కింది. ఇందులో లైంగికదాడి, రేప్-హత్య, యాసిడ్ దాడులు ఉన్నాయి. తాజాగా మళ్లీ నేరాలు పెరిగిపోతున్నాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram