World Record | ప్ర‌పంచ రికార్డు బ‌ద్ద‌లు.. ఒకే ఏడాది 777 సినిమాలు వీక్షించిన అమెరిక‌న్

World Record | సినిమా పిచ్చి చాలా మందికి ఉంటుంది. విడుద‌లైన ప్ర‌తి సినిమాను చూసే వాళ్లు చాలా మందినే ఉంటారు. అలా సినిమా మైకంలోనే మునిగి తేలుతుంటారు. ఓ అమెరిక‌న్ కూడా త‌న‌కున్న సినిమా పిచ్చితో.. ఏడాది కాలంలో 777 సినిమాల‌ను వీక్షించి ప్ర‌పంచ రికార్డు బ‌ద్ద‌లు కొట్టాడు. అమెరికాకు చెందిన జాక్ స్వోప్ అనే వ్య‌క్తి గ‌తేడాది జులై నుంచి ఈ ఏడాది జులై వ‌ర‌కు 777 సినిమాల‌ను చూసిన‌ట్లు గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్ […]

  • By: raj    latest    Sep 09, 2023 4:21 AM IST
World Record | ప్ర‌పంచ రికార్డు బ‌ద్ద‌లు.. ఒకే ఏడాది 777 సినిమాలు వీక్షించిన అమెరిక‌న్

World Record |

సినిమా పిచ్చి చాలా మందికి ఉంటుంది. విడుద‌లైన ప్ర‌తి సినిమాను చూసే వాళ్లు చాలా మందినే ఉంటారు. అలా సినిమా మైకంలోనే మునిగి తేలుతుంటారు. ఓ అమెరిక‌న్ కూడా త‌న‌కున్న సినిమా పిచ్చితో.. ఏడాది కాలంలో 777 సినిమాల‌ను వీక్షించి ప్ర‌పంచ రికార్డు బ‌ద్ద‌లు కొట్టాడు.

అమెరికాకు చెందిన జాక్ స్వోప్ అనే వ్య‌క్తి గ‌తేడాది జులై నుంచి ఈ ఏడాది జులై వ‌ర‌కు 777 సినిమాల‌ను చూసిన‌ట్లు గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్ పేర్కొంది. 2018లో ఫ్రాన్స్‌కు చెందిన విన్సెంట్ క్రోన్.. 715 సినిమాల‌ను వీక్షించ‌గా, ఆ రికార్డుల‌ను జాక్ చెరిపేశాడు.

ఈ సంద‌ర్భంగా జాక్ మాట్లాడుతూ.. నేను సినిమా ల‌వ‌ర్‌ను అని పేర్కొన్నాడు. ప్ర‌తి ఏడాది స‌గటున 100 నుంచి 150 సినిమాల‌ను వీక్షిస్తాన‌ని తెలిపాడు. ఈ ప్ర‌పంచ రికార్డు కోసం.. మినియ‌న్స్: రైజ్ ఆఫ్ గ్రూ అనే మూవీతో ప్రారంభించి ఇండియానా జోన్స్ అండ్ ది డ‌య‌ల్ ఆఫ్ డెస్టినీ సినిమాతో ముగించాడు.

ఇక ఈ 777 సినిమాల‌ను వీక్షించిన స‌మ‌యంలో జాక్.. ఇత‌ర కార్య‌క్ర‌మాల‌కు పాల్ప‌డలేదు. ఫోన్ చూడ‌టం కానీ, ఆహారం తిన‌డం లాంటివి చూడ‌లేదు. ఒక సినిమా ముగిసే వ‌ర‌కు నిబ‌ద్ధ‌త‌తో ఉండేవాడు. క‌నీసం డ్రింక్స్ కూడా తీసుకోక‌పోయేవాడు. జా

క్ సినిమా చూసిన ప్ర‌తిసారి.. అత‌న్ని ప‌రిశీల‌కులు నిశితంగా గ‌మ‌నించే వారు. జాక్ ఫుల్ టైమ్ జాబ్ చేసుకుంటూనే ఈ రికార్డు సృష్టించాడు. ప్ర‌తి రోజు ఉద‌యం 6:45 నుంచి మ‌ధ్యాహ్నం 2:45 వ‌ర‌కు వ‌ర్క్ చేసి.. మూడు సినిమాలు వీక్షించేవాడు. వారాంతాల్లో అంత‌కంటే ఎక్కువ సినిమాల‌ను చూసేవాడు.