Habits | 8 అలవాట్లతో.. ఆరోగ్య జీవనం
జీవన విధానామే అసలు జౌషధం లైఫ్‌స్టైల్ మెడిసిన్‌తో లైఫ్‌టైమ్ వృద్ధి అమెరికన్ సొసైటీ ఫర్ న్యూట్రిషన్ తాజా అధ్యయనంలో వెలుగులోకి Habits | విధాత: ఇంటి నుంచి కదలం.. కాసేపు కూడా నడవం.. అడ్డగోలుగా తింటాం. తాగుతాం.. డ్రగ్స్ తీసుకుంటాం. అర్ధదాటినా నిద్రపోం.. ఇంకెవరినీ పట్టించుకోం.. మరొకరిని కలువం.. సెల్‌ఫోనే మన ప్రపంచం.. కానీ, కనీసం 60 ఏండ్లయినా బతకాలని ఆశపడతాం. అయితే, జీవన విధానమే అసలైన ఔషధమనే సంగతే మర్చిపోతాం. చివరి అర్ధంతరంగా తనువు చాలిస్తాం. […]
- జీవన విధానామే అసలు జౌషధం
- లైఫ్‌స్టైల్ మెడిసిన్‌తో లైఫ్‌టైమ్ వృద్ధి
- అమెరికన్ సొసైటీ ఫర్ న్యూట్రిషన్
- తాజా అధ్యయనంలో వెలుగులోకి
Habits | విధాత: ఇంటి నుంచి కదలం.. కాసేపు కూడా నడవం.. అడ్డగోలుగా తింటాం. తాగుతాం.. డ్రగ్స్ తీసుకుంటాం. అర్ధదాటినా నిద్రపోం.. ఇంకెవరినీ పట్టించుకోం.. మరొకరిని కలువం.. సెల్‌ఫోనే మన ప్రపంచం.. కానీ, కనీసం 60 ఏండ్లయినా బతకాలని ఆశపడతాం. అయితే, జీవన విధానమే అసలైన ఔషధమనే సంగతే మర్చిపోతాం. చివరి అర్ధంతరంగా తనువు చాలిస్తాం.
జీవం లేని యంత్రాలకు నిర్వహణ (Maintenance) అవసరం. అలాగే మన శరీరం, అవయవాలు సక్రమంగా పని చేయాలంటే కొన్ని మంచి అలవాట్లు అలవర్చుకోవాలి. అప్పుడే వ్యాధులు దూరమై జీవన ప్రయాణం పెరుగుతుంది. మనుషులు ఎనిమిది అలవాట్లను అవలంబించడం ద్వారా లైఫ్‌టైమ్‌ను దశాబ్దాలపాటు పెంచుకోవచ్చని తాజా అధ్యయనంలో వెల్లడైంది.
అమెరికన్ సొసైటీ ఫర్ న్యూట్రిషన్ (American Society for Nutrition) వార్షిక సమావేశంలో ఇటీవల ఒక అధ్యయన నివేదికను సమర్పించారు. మధ్య వయస్సు నాటికి ఎనిమిది అలవాట్లను పాటించిన పురుషులు.. ఇతర అలవాట్లు కలిగిన పురుషుల కంటే 24 ఏండ్లు అధికకాలం జీవించారని పరిశోధకులు కనుగొన్నారు.
అలాగే మహిళల జీవితకాలం 23 సంవత్సరాలు పెరిగినట్టు గుర్తించారు. 40 ఏండ్లు అంతకు పైబడిన అమెరికాకు చెందిన 7.20 లక్షల మంది నుంచి ఆధారాలు సేకరించి డాటా రూపొందించారు. దీనిని జాతీయంగా ప్రాతినిధ్య నమూనాగా భావించారు. వాటిని “చికిత్సా జీవనశైలి కారకాలు”గా పరిశోధకులు అభివర్ణించారు.
ఎనిమిది ముఖ్య అలవాట్లు ఇవే..
1. పొగ తాగకూడదు.
2. శారీరకంగా చురుకుగా ఉండాలి.
3. ఒత్తిడిని నియంత్రించుకోవాలి.
4. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.
5. మంచి నిద్ర. పరిశుభ్రత పాటించాలి.
6. అతిగా మద్యపానం సేవించవద్దు.
6. మత్తు పదార్థాలకు బానిస కావద్దు.
7. సానుకూల సామాజిక సంబంధాలను కలిగి ఉండాలి.
13 శాతం తక్కువ మరణాలు
మొత్తం ఎనిమిది అలవాట్లు పాటించిన వ్యక్తులు దాదాపు ఎనిమిదేండ్ల అధ్యయన కాలంలో ఏ కారణం చేతనైనా చనిపోయే అవకాశం 13 శాతం తక్కువగా ఉందని పరిశోధకులు తెలిపారు. ఆరోగ్యకరమైన అలవాట్ల సంఖ్య పెరగడంతో మరణాల రేటు తగ్గినట్టు పేర్కొన్నారు.
అత్యధిక మరణాల ప్రమాదం ధూమపానం, తక్కువ శారీరక శ్రమ. డ్రగ్స్ వాడకంతో ముడిపడి ఉన్నట్టు పరిశోధకులు వెల్లడించారు. ఆరోగ్యకరమైనఎనిమిది అలవాట్లను “లైఫ్‌స్టైల్ మెడిసిన్”గా వర్గీకరించారు. లైఫ్‌స్టైల్ మెడిసిన్ ఆరోగ్య సంరక్షణ ఖర్చులను తగ్గించడంలో కూడా సహాయపడుతుందని తెలిపారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram