Uttarakhand | రెండో పెళ్లి కోసం.. ఇద్ద‌రు కూతుళ్ల‌ను హ‌త్య చేసిన తండ్రి

Uttarakhand |Crime News | విధాత: ఓ వ్య‌క్తి దారుణానికి పాల్ప‌డ్డాడు. కంటికి రెప్ప‌లా కాపాడుకోవాల్సిన ఇద్ద‌రు కూతుళ్ల‌ను హ‌త్య చేశాడు. ఈ ఘ‌ట‌న ఉత్త‌రాఖండ్‌లోని డెహ్రాడూన్ జిల్లాలో వెలుగు చూసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. డెహ్రాడూన్ జిల్లాలోని డోయివాలా ఏరియాకు చెందిన జితేంద్ర‌కు ఐదేండ్ల క్రితం రీనా అనే మ‌హిళ‌తో వివాహ‌మైంది. ఈ దంప‌తుల‌కు మూడున్న‌రేండ్లు, ఏడాదిన్న‌ర వ‌య‌సున్న ఇద్ద‌రు కూతుళ్లు ఉన్నారు. అయితే రీనాను మానసికంగా, శారీర‌కంగా వేధింపుల‌కు గురి చేయ‌డంతో ఆమె జితేంద్ర‌ను, ఇద్ద‌రు […]

Uttarakhand | రెండో పెళ్లి కోసం.. ఇద్ద‌రు కూతుళ్ల‌ను హ‌త్య చేసిన తండ్రి

Uttarakhand |Crime News |

విధాత: ఓ వ్య‌క్తి దారుణానికి పాల్ప‌డ్డాడు. కంటికి రెప్ప‌లా కాపాడుకోవాల్సిన ఇద్ద‌రు కూతుళ్ల‌ను హ‌త్య చేశాడు. ఈ ఘ‌ట‌న ఉత్త‌రాఖండ్‌లోని డెహ్రాడూన్ జిల్లాలో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. డెహ్రాడూన్ జిల్లాలోని డోయివాలా ఏరియాకు చెందిన జితేంద్ర‌కు ఐదేండ్ల క్రితం రీనా అనే మ‌హిళ‌తో వివాహ‌మైంది. ఈ దంప‌తుల‌కు మూడున్న‌రేండ్లు, ఏడాదిన్న‌ర వ‌య‌సున్న ఇద్ద‌రు కూతుళ్లు ఉన్నారు.

అయితే రీనాను మానసికంగా, శారీర‌కంగా వేధింపుల‌కు గురి చేయ‌డంతో ఆమె జితేంద్ర‌ను, ఇద్ద‌రు కూతుళ్ల‌ను వ‌దిలిపెట్టి వెళ్లిపోయింది.

దీంతో అత‌ను రెండో పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. ఈ క్ర‌మంలో అడ్డుగా ఉన్న ఇద్ద‌రు పిల్ల‌ల‌ను చంపాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. ఇక ఇద్ద‌రు కూతుళ్ల గొంతు నులిమి చంపి, పారిపోయాడు.

రీనా త‌ల్లి ఆశు దేవి ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. నిందితుడి ఆచూకీ కోసం గాలింపు చ‌ర్య‌లు ముమ్మ‌రం చేశారు. రీనా ప్ర‌స్తుతం హైద‌రాబాద్ న‌గ‌రంలో ఉంటున్న‌ట్లు ఆమె త‌ల్లి ఆశు దేవీ తెలిపింది.