Dangerous plant: మీ ఇంటి పరిసరాల్లో ఈ మొక్క ఉందా? అనవసర వివాదాలు కొని తెచ్చుకున్నట్టే…!

Dangerous plant: కొన్ని రకాల మొక్కలు మన ఇంటి ఆవరణలో, పెరట్లో ఉంటే చాలా మంచిదని వాస్తు నిపుణులు చెబుతుంటారు. అలాగే కొన్ని రకాల మొక్కలను ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచుకోవద్దని.. వాటి ద్వారా లేని పోని తగాదాలు వస్తాయని కూడా సూచిస్తుంటారు. అటువంటి ఒక మొక్క గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. ఎడారి ప్రాంతాల్లో పెరిగే కాక్టస్ మొక్కలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటి పరిసరాల్లో ఉండకుండా చూసుకోవాలని వాస్తు పండితులు చెబుతున్నారు. ఈ మొక్కలు మన ఇంటి సమీపంలో ఉంటే లేనిపోని వివాదాలు.. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముడతాయాట.
వాస్తు శాస్త్రం ఏం చెబుతుంది?
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి పెరట్లో లేదా ఇంటి లోపల కాక్టస్ వంటి ముళ్ల మొక్కలను పెంచుకోకూడదట. ఇవి నెగిటివ్ ఎనర్జీని వ్యాపింపజేస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఈ మొక్కలను పెంచుకుంటే కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలను పెరుగుతాయట. వీటికి బదులుగా, తులసి, మనీ ప్లాంట్, లేదా జాడే ప్లాంట్ వంటి మొక్కలను పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
పర్యావరణ దృష్ట్యా మంచిదే..
పర్యావరణ పరంగా చూస్తే కాక్టస్ మొక్కలు మంచివే. ఇవి తక్కువ నీటితో పెరుగుతాయి. పర్యావరణానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ వాస్తు నమ్మకాల ప్రకారం ఇవి ఇంటి లోపల లేదా పెరట్లో ఉంచడానికి అనుకూలం కాదని వాస్తు పండితులు చెబుతన్నారు. కాబట్టి ఇటువంటి మొక్కలు మీ ఇంటి పరిసరప్రాంతాల్లో ఉన్నాయేమో చూసుకోండి.