ORR | ఔట‌ర్‌పై ఇక 120 కి.మీ. వేగంతో దూసుకెళ్లొచ్చు.. నోటిఫికేష‌న్ జారీ

ORR | ఔట‌ర్ రింగ్ రోడ్డుపై ఇకపై గంట‌ల‌కు 120 కిలోమీట‌ర్ల వేగంతో దూసుకెళ్లొచ్చు. ఓఆర్ఆర్‌పై గ‌రిష్ఠ‌, క‌నిష్ఠ వేగ ప‌రిమితికి సంబంధించి సైబ‌రాబాద్ పోలీసు క‌మిష‌న‌ర్ స్టీఫెన్ ర‌వీంద్ర నోటిఫికేష‌న్ జారీ చేశారు. ఔట‌ర్ 1, 2 లేన్ల‌లో గ‌రిష్ఠంగా గంట‌కు 120 కిలోమీట‌ర్ల వేగంతో, 3, 4 లేన్ల‌పై గ‌రిష్ఠంగా 80 కి.మీ. వేగంతో, క‌నిష్ఠంగా 40 కి.మీ. వేగంతో ప్ర‌యాణించొచ్చు. మొత్తంగా ఓఆర్ఆర్‌పై గంట‌కు 40 కిలోమీట‌ర్ల కంటే త‌క్కువ వేగంతో వాహ‌నాలు […]

ORR | ఔట‌ర్‌పై ఇక 120 కి.మీ. వేగంతో దూసుకెళ్లొచ్చు.. నోటిఫికేష‌న్ జారీ

ORR | ఔట‌ర్ రింగ్ రోడ్డుపై ఇకపై గంట‌ల‌కు 120 కిలోమీట‌ర్ల వేగంతో దూసుకెళ్లొచ్చు. ఓఆర్ఆర్‌పై గ‌రిష్ఠ‌, క‌నిష్ఠ వేగ ప‌రిమితికి సంబంధించి సైబ‌రాబాద్ పోలీసు క‌మిష‌న‌ర్ స్టీఫెన్ ర‌వీంద్ర నోటిఫికేష‌న్ జారీ చేశారు. ఔట‌ర్ 1, 2 లేన్ల‌లో గ‌రిష్ఠంగా గంట‌కు 120 కిలోమీట‌ర్ల వేగంతో, 3, 4 లేన్ల‌పై గ‌రిష్ఠంగా 80 కి.మీ. వేగంతో, క‌నిష్ఠంగా 40 కి.మీ. వేగంతో ప్ర‌యాణించొచ్చు.

మొత్తంగా ఓఆర్ఆర్‌పై గంట‌కు 40 కిలోమీట‌ర్ల కంటే త‌క్కువ వేగంతో వాహ‌నాలు ప్ర‌యాణించ‌కూడ‌ద‌ని నోటిఫికేష‌న్‌లో స్ప‌ష్టం చేశారు. వేగ ప‌రిమితికి సంబంధించి నిబంధ‌న‌లు ఉల్లంఘించే వాహ‌న‌దారుల‌పై ట్రాఫిక్ సిబ్బంది భారీ జ‌రిమానాలు విధిస్తార‌ని, మోటారు వాహ‌నాల చ‌ట్టం ప్ర‌కారం శిక్ష‌లుంటాయ‌ని హెచ్చ‌రించారు.

నిర్దేశిత లేన్ల ప‌రిధిలో సూచించిన వేగంతో ప్ర‌యాణించాలి. జిగ్‌జాగ్‌గా ప్ర‌యాణించ‌కూడ‌దు. వేగంగా వెళ్లే వాహ‌నాలు 1, 2 లేన్ల‌పై, త‌క్కువ వేగంతో వెళ్లే వాహ‌నాలు 3, 4 లేన్ల ప‌రిధిలో ప్ర‌యాణించాలి. భారీ వాహ‌నాలు క‌చ్చితంగా 3, 4 లేన్ల‌లోనే ప్ర‌యాణించాలి. పాద‌చారులు, బైక్‌లు, ఆటోల‌ను ఔట‌ర్‌పైకి అనుమ‌తించ‌రు.