అంతర్జాతీయ వ్యభిచార ముఠా గుట్టు రట్టు.. 14,190 మంది యువ‌తుల‌కు విముక్తి

కాల్ సెంట‌ర్ల ద్వారా బుకింగ్, వ్య‌భిచారం 14,190 మందిని వ్య‌భిచార కూపంలోకి దించిన ముఠా ర‌ష్యా, ఉజ్బెకిస్తాన్, థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, నేపాల్, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, అస్సాంల నుంచి స‌ర‌ఫ‌రా… మొత్తం 39 మంది నిందితులు-17 మంది అరెస్ట్‌ రాడిస‌న్ హోట‌ల్ మేనేజ‌ర్ రాకేశ్ అరెస్ట్‌ మిగ‌తా వారి కోసం గాలింపు చ‌ర్య‌లు ముమ్మ‌రం వ్యాపారంలో ఎండీఎంఏ డ్ర‌గ్ వినియోగిస్తున్న ముఠా అంత‌ర్జాతీయ సెక్స్ రాకెట్ ముఠాను చేధించిన పోలీసులు విధాత‌: వ్య‌భిచారం […]

అంతర్జాతీయ వ్యభిచార ముఠా గుట్టు రట్టు.. 14,190 మంది యువ‌తుల‌కు విముక్తి
  • కాల్ సెంట‌ర్ల ద్వారా బుకింగ్, వ్య‌భిచారం
  • 14,190 మందిని వ్య‌భిచార కూపంలోకి దించిన ముఠా
  • ర‌ష్యా, ఉజ్బెకిస్తాన్, థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, నేపాల్, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, అస్సాంల నుంచి స‌ర‌ఫ‌రా…
  • మొత్తం 39 మంది నిందితులు-17 మంది అరెస్ట్‌
  • రాడిస‌న్ హోట‌ల్ మేనేజ‌ర్ రాకేశ్ అరెస్ట్‌
  • మిగ‌తా వారి కోసం గాలింపు చ‌ర్య‌లు ముమ్మ‌రం
  • వ్యాపారంలో ఎండీఎంఏ డ్ర‌గ్ వినియోగిస్తున్న ముఠా
  • అంత‌ర్జాతీయ సెక్స్ రాకెట్ ముఠాను చేధించిన పోలీసులు

విధాత‌: వ్య‌భిచారం నిర్వ‌హ‌ణ కోసం ఏకంగా కాల్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేసి బుకింగ్‌లు చేస్తూ వ్య‌భిచారం నిర్వ‌హిస్తున్న అంత‌ర్జాతీయ ముఠాను తెలంగాణ సైబ‌రాబాద్ పోసులు చేధించారు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం వ్య‌భిచారం నిర్వ‌హించే ఈ ముఠా ఏకంగా ఢిల్లీ, బెంగళూర్‌, హైద‌రాబాద్‌ల‌లో కాల్ సెంట‌ర్లు నిర్వ‌హిస్తున్నారు.

ఈ కాల్ సెంట‌ర్ల నుంచి ఫోన్లు, వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ర్శిస్తారు. ఒక్కో వాట్సాప్ గ్రూప్‌లో300 మంది వ‌ర‌కు ఉంటారు. ఇలా అనేక గ్రూప్‌లు ఏర్పాటు చేసి, వాటి ద్వారా క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ర్శించి వ్య‌భిచారం నిర్వ‌హిస్తున్నారు. ఇలా ఏకంగా ఈ ముఠా14,190 మంది యువ‌తుల‌ను ఈ రొంపిలోకి దింపింది.

ర‌ష్యా, థాయ్ లాండ్ త‌దిత‌ర దేశాల నుంచి స‌ర‌ఫ‌రా

క‌స్ట‌మ‌ర్ల కోసం వ్య‌బిచారం నిర్వ‌హించే అంత‌ర్జాతీయ ముఠా స‌భ్యులు ర‌ష్యా, ఉజ్బెకిస్తాన్, థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, నేపాల్, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, అస్సాంల నుంచి అమ్మాయిల‌ను స‌ర‌ఫ‌రా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వ్య‌భిచారం చేయించ‌డానికి అమ్మాయిల‌ను(బాధితులు) దేశంలో ప‌శ్చిమ బెంగాల్ నుంచి 50 శాతం, క‌ర్ణాట‌క నుంచి 20 శాతం, మ‌హారాష్ట్ర నుంచి 15 శాతం, ఢిల్లీ నుంచి 07 శాత, ఇత‌ర రాష్ట్రాల నుంచి 05, ఇత‌ర దేశాల నుంచి 03 శాతం మంది ఉన్న‌ట్లు సైబ‌రాబాద్ పోలీసులు వెల్ల‌డించారు.

ఉద్యోగాల ఎర‌

ముఖ్యంగా యువ‌తుల‌కు ఉద్యోగాలు క‌ల్పిస్తామ‌నే నెపంతో ఎవ‌ర వేసి తీసుకువ‌చ్చి వ్య‌భిచార రొంపిలోకి దింపుతున్న‌ట్లు పోలీసులు గుర్తించారు. క‌స్ట‌మ‌ర్ల కోసం వాట్సాప్ గ్రూప్‌ల‌తో పాటు ప‌లు వెబ్ సైట్ల ద్వారా క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ర్శిస్తున్నారు. ఈ దుర్మార్గ‌మైన రొంపిలోకి దింప‌డానికి ఉద్యోగాలు ఇప్పిస్తామ‌ని చెప్ప‌డంతో పాటు, విలాసవంతమైన జీవనశైలి, సులభమైన డబ్బు వ‌స్తుంద‌నే సాకుతో వారిని ఈ వృత్తిలోకి దింపుతున్నారు. ఈ మేర‌కు విచార‌ణ స‌మ‌యంలో నింధితులు ఒప్పుకున్న‌ట్లు పోలీసులు తెలిపారు. ఈ మేర‌కు ఈ వ్య‌భిచార ముఠా – Locanto, Skokka, Hyderabadescorts, కాల్‌గర్ల్స్ ఇన్ హైదరాబాద్, Luxuryescortservices,www.myheavenmodels.com, www.natasharoy.in త‌దిత‌ర వెబ్‌సైట్ల‌ను ఉప‌యోగించిన‌ట్లు గుర్తించారు.

17 మంది అరెస్ట్‌

వివిధ ర‌కాలుగా క‌స్ట‌మ‌ర్ల‌ను గుర్తించి వ్య‌భిచారం నిర్వ‌హిస్తున్న 17 మంది వ్య‌క్తుల‌ను సైబరాబాద్ పోలీస్ విభాగానికి చెందిన‌ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ అనైతిక ట్రాఫిక్ (నివారణ) చట్టం కింద ఈ కేసును చేధించి అరెస్టు చేశారు. రాడిస‌న్ హోట‌ల్ మేనేజ‌ర్ రాకేశ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

అంత‌ర్జాతీయ వ్య‌భిచార ముఠా వివిధ హోటళ్లు, ఓయో గదులను తీసుకొని వ్యవస్థీకృత వ్యభిచారం చేయిస్తూ భారీ ఎత్తున డబ్బు వసూలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అంత‌ర్జాతీయ‌సెక్స్ రాకెట్ ముఠాలో మొత్తం 39 మంది ఉన్న‌ట్లు సైబ‌రాబాద్ పోలీసులు గుర్తించారు. ఇందులో ఇప్ప‌టి వ‌ర‌కు 17 మందిని అరెస్ట్ చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన వారుసైబరాబాద్‌, హైదరాబాద్‌ కమిషనరేట్‌లలో చాలా కేసుల్లో వీరు పరారీలో ఉన్న‌ట్లు పేర్కొన్నారు.

వ్య‌భిచారం నిర్వ‌హించే తీరు..

మొదట బ్రోకర్ బాధితురాలిని సంప్రదిస్తాడు, ఆత‌రువాత అతను ఆమె ఫోటోలను ఆర్గనైజర్స్ వాట్సాప్ గ్రూపులలో ఉంచుతాడు. ఆపై నిర్వాహకులు ప్రొఫైల్ (బాధితురాలి ఫోటోలు) ఆర్గనైజర్ బుక్స్ హోటల్ , ఫ్లైట్ టిక్కెట్లను పంపిస్తారు. అనంతరం బాధితిరాలు వచ్చి హోటల్‌కు చేరుకుంటాడు. అప్పుడు, నిర్వాహకులు ఈ బాధితురాలి ఫోటోల‌ను వాట్సాప్ గ్రూపులు,యు కాల్ గర్ల్ వెబ్‌సైట్‌లలో Locanto, Skokka, www.myheavenmodels.com, www.natasharoy.in మొదలైన వాటిలో ఉంచుతారు.

ఈ ప్రకటనలను చూడటం ద్వారా, కస్టమర్‌లు వాట్సాప్ నంబర్‌కు కాల్ చేస్తారు లేదా వాట్సాప్‌కు మెసేజ్ చేస్తారు, ఆపై కాల్ సెంటర్ వ్యక్తులు కస్టమర్‌ల‌ను ఫోన్‌లలో ఎంగేజ్ చేసి హోట‌ల్‌ వరకు గైడ్ చేస్తారు. ఆ తర్వాత వారు కస్టమర్ గురించి నిర్వాహకులకు తెలియజేస్తారు. ఇవ‌న్నీ నిర్దేశించిన వాట్సాప్ గ్రూప్‌ల ద్వారానే చేస్తారు. నిర్వాహకుడికి అతని ఫోన్ నంబర్ ఇస్తారు. అప్పుడు అతను బాధితిరాలిని, కస్టమర్‌తో ఒక కాన్ఫరెన్స్ తీసుకొని హోటల్ గదికి పంపుతారు. ఇలా వ్య‌భిచారాన్ని అత్యంత గుట్టుగా, సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని ఉప‌యోగించి నిర్వ‌హిస్తున్నారు.

పే మెంట్ అంతా ఫోన్ పే,గూగుల్ పే, పేటీఎంల ద్వారానే…

డ‌బ్బు చెల్లింపుల‌కు న‌గ‌దు రూపంలోకానీ, ఫోన్ పే, Google పే,Paytm మొదలైన వాటి ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫార్మాట్‌లో బాధితురాలికి 30 శాతం ప్రకటన పోస్టింగ్, కాల్ సెంటర్ వ్యక్తులకు 35 శాతం, నిర్వాహకులకు 35శాతం ముడుతుంది. ఇలా బాధితుల‌కు కేవ‌లం 30శాతం ఇచ్చి. మిగ‌తా 70శాతాన్ని నిర్వాహ‌కులు తీసుకుంటున్నార‌ని పోలీసులు తెలిపారు.

బాధితుల నుంచి సేక‌రించిన స‌మాచారం ఆధారంగా అరెస్ట్‌లు

బాధితుల నుండి సేకరించిన సమాచారం మేర‌కు పోలీసులువారి ఫోన్ నంబర్లు, నగరంలో ఈ వ్యాపారం ఎవరు చేస్తున్నారు అనేది గుర్తించారు.ఎవరి నుండి ఎవ‌రి ద్వ‌రా వ్యాపారం జ‌రుగుతుండడంతో తెలుసు కున్నారు. ఈ మేర‌కు కీల‌క‌మైన ప్ర‌ధాన నిర్వాహ‌కుడిని ప‌ట్ట‌కోవ‌డానికి పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసారు.

ఈ ఏడాది న‌వంబ‌ర్ 15వ తేదీన సల్మాన్ @వివేక్,ఇర్ఫాన్ @ వికాస్‌లను సన్‌సిటీ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. క్షుణ్ణంగా విచారించిన పోలీసులు వారి నుంచి మ‌రింత స‌మాచారాన్ని రాబ‌ట్టారు. ఈ మేర‌కు ముఖ్య‌మైన నిందితుల‌ను ట్రాక్ చేసి న‌వంబ‌ర్ 18వ తేదీన సోమాజిగూడ వద్ద అదీమ్ @ అర్నవ్ @ అభయ్, సమీర్ మరియు హర్బిందర్ కౌర్ @ సిమ్రాన్ కౌర్ @ అనికలను అరెస్టు చేశారు. మొత్తం 5 మంది నిర్వాహకులను అరెస్టు చేశారు. తాజాగా రాడిస‌న్ హోట‌ల్ మేనేజ‌ర్ రాకేశ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

నిందితులపై నమోదైన కేసులు:

1. Cr. నెం. 1338/2022 U/s 370 (A) (2) PS గచ్చిబౌలి, Cyb, ITP చట్టం 1956 యొక్క IPC & సెక్షన్ 3,4,5 & 6
2. Cr.No, 598/2022, U/S. 370,370(A) IPC, PS మియాపూర్ ITP చట్టంలోని సెక్షన్ 3,4, & 5
3. Cr.No. 409/2022, U/S. 370(A) IPC, PS కూకట్‌పల్లి ITP చట్టంలోని సెక్షన్ 3,4 & 5,
4. Cr.No. 537/2022, U/S. 370(A) IPC, PS కూకట్‌పల్లి ITP చట్టంలోని సెక్షన్ 3,4 & 5,
5. Cr.No. 1234/2022, U/S. 370(A)(2) IPC, PS మాదాపూర్ ITP చట్టంలోని సెక్షన్ 3,4 & 5. గతంలో 15 మంది నిర్వాహకులపై (40) కేసులు నమోదు చేయబడ్డాయి.