Dhankhar | సభలో చర్చల్లేవ్.. గొడవలే: ఉపరాష్ట్రపతి ధంఖర్
శాసన వ్యవస్థ పనితీరు ఘోరం న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలు పనిలో పోటీపడుతున్నాయ్ ఉపరాష్ట్రపతి ధంఖర్ ఆవేదన Dhankhar | విధాత: రాజ్యసభలో ఏ అంశం కూడా సరిగ్గా చర్చలు జరుగడం లేదని, గొడవలు, అంతరాయలే చోటుచేసుకున్నాయని ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ధంఖర్ ఆవేదన వ్యక్తంచేశారు. రాజ్యసభ ఛైర్మన్‌గా తాను సభలో చర్చలు కాకుండా ఆందోళనలు, అంతరాయాలను చూస్తున్నానని చెప్పారు. న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక శాఖలు తమ పనిలో తీవ్ర పోటీ పడుతుండగా, శాసనసభలో మాత్రం పరిస్థితి చాలా […]
- శాసన వ్యవస్థ పనితీరు ఘోరం
- న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలు
- పనిలో పోటీపడుతున్నాయ్
- ఉపరాష్ట్రపతి ధంఖర్ ఆవేదన
Dhankhar | విధాత: రాజ్యసభలో ఏ అంశం కూడా సరిగ్గా చర్చలు జరుగడం లేదని, గొడవలు, అంతరాయలే చోటుచేసుకున్నాయని ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ధంఖర్ ఆవేదన వ్యక్తంచేశారు. రాజ్యసభ ఛైర్మన్‌గా తాను సభలో చర్చలు కాకుండా ఆందోళనలు, అంతరాయాలను చూస్తున్నానని చెప్పారు. న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక శాఖలు తమ పనిలో తీవ్ర పోటీ పడుతుండగా, శాసనసభలో మాత్రం పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నదని విచారం వ్యక్తం చేశారు.
రాజకీయ రంగంలోని వ్యక్తులకు రాజకీయాలు చేయడానికి అన్ని హక్కులు ఉన్నాయని చెప్పారు. అదే సందర్భంలో దేశాభివృద్ధి విషయానికి వస్తే రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా వ్యవహరించాలని సూచించారు.
దేశరాజధానిలోని న్యూ ఢిల్లీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ 25వ వార్షిక స్నాతకోత్సవంలో ధంఖర్ అధ్యక్షోపన్యాసం చేశారు. భారతదేశ న్యాయ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉన్నదని, అత్యున్నత స్థాయిలో పని చేస్తున్నదని కితాబిచ్చారు. ప్రధానమంత్రి నేతృత్వంలోని కార్యనిర్వాహకవర్గం అతిగా పనిచేస్తున్నదని చెప్పారు. పారదర్శకత, జవాబుదారీతనం, పాలన ముఖ్య లక్షణంగా ఉండాలని సూచించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram