Viral Video | డాక్టర్‌ను 50 మీటర్లు లాక్కెళ్లిన కారు.. ఎందుకంటే..?
Viral Video | విధాత: తన కారును ఎందుకు ఢీకొట్టావని ప్రశ్నించిన పాపానికి మరో కారు డ్రైవర్ దారుణంగా ప్రవర్తించాడు. కారుకు అడ్డంగా నిలబడిన డాక్టర్‌ను 50 మీటర్ల దూరం వరకు లాక్కెళ్లాడు. ఈ ఘటన హర్యానాలోని పంచకుల సిటీలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. పంచకులలోని ఎండీసీలో డాక్టర్ గగన్ తన కుటుంబ సభ్యులతో నివసిస్తున్నాడు. అయితే ట్యూషన్ నుంచి ఇంటికి తన కుమారుడిని తీసుకువస్తుండగా, డాక్టర్ కారును మరో కారు ఢీకొట్టింది. దీంతో డాక్టర్ […]
Viral Video |
విధాత: తన కారును ఎందుకు ఢీకొట్టావని ప్రశ్నించిన పాపానికి మరో కారు డ్రైవర్ దారుణంగా ప్రవర్తించాడు. కారుకు అడ్డంగా నిలబడిన డాక్టర్‌ను 50 మీటర్ల దూరం వరకు లాక్కెళ్లాడు. ఈ ఘటన హర్యానాలోని పంచకుల సిటీలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. పంచకులలోని ఎండీసీలో డాక్టర్ గగన్ తన కుటుంబ సభ్యులతో నివసిస్తున్నాడు. అయితే ట్యూషన్ నుంచి ఇంటికి తన కుమారుడిని తీసుకువస్తుండగా, డాక్టర్ కారును మరో కారు ఢీకొట్టింది. దీంతో డాక్టర్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. కారు దిగి.. ఆ వాహనానికి ఎదురుగా నిలబడ్డాడు.
ఈక్రమంలో కారు ముందు నిలబడ్డ డాక్టర్‌ను కారుతో లాక్కెళ్లాడు. డాక్టర్‌ను 50 మీటర్ల దూరం వరకు లాక్కెళ్లి వదిలిపెట్టారు. బాధిత డాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గాయపడిన డాక్టర్ సెక్టార్ 6 ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దుండగుల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram