Viral Video | ఖ‌డ్గ‌మృగాన్ని మ‌ట్టి క‌రిపించిన ఏనుగు..

Viral Video | గ‌జ‌రాజు అడుగు వేసిందంటే చాలు ఆ భూమి బ‌ద్ద‌లైపోవాల్సిందే. చిన్న చిన్న జంతువులు కూడా ఏనుగు దెబ్బ‌కు పారిపోవాల్సిందే. అలాంటి గ‌జ‌రాజుపై ఓ ఖ‌డ్గ‌మృగం యుద్ధం చేసేందుకు సిద్ధ‌మైంది. కానీ ఖ‌డ్గ‌మృగాన్ని ఏనుగు మ‌ట్టి క‌రిపించింది. ప్ర‌స్తుతం ఈ ఫైటింగ్‌కు సంబంధించిన వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. అయితే ఈ వీడియోను ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ అధికారి సుశాంత నంద త ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేశారు. ఇక ఈ వీడియోకు […]

Viral Video | ఖ‌డ్గ‌మృగాన్ని మ‌ట్టి క‌రిపించిన ఏనుగు..

Viral Video |

గ‌జ‌రాజు అడుగు వేసిందంటే చాలు ఆ భూమి బ‌ద్ద‌లైపోవాల్సిందే. చిన్న చిన్న జంతువులు కూడా ఏనుగు దెబ్బ‌కు పారిపోవాల్సిందే. అలాంటి గ‌జ‌రాజుపై ఓ ఖ‌డ్గ‌మృగం యుద్ధం చేసేందుకు సిద్ధ‌మైంది. కానీ ఖ‌డ్గ‌మృగాన్ని ఏనుగు మ‌ట్టి క‌రిపించింది. ప్ర‌స్తుతం ఈ ఫైటింగ్‌కు సంబంధించిన వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది.

అయితే ఈ వీడియోను ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ అధికారి సుశాంత నంద త ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేశారు. ఇక ఈ వీడియోకు క్లాష్ ఆప్ టైటాన్స్ అని క్యాప్ష‌న్ ఇచ్చారు. ఏనుగు – ఖ‌డ్గ‌మృగం యుద్ధానికి సిద్ధంగా ఉన్న‌ట్లు వీడియోలో స్ప‌ష్టంగా క‌న‌బ‌డుతుంది.

ఏనుగును దెబ్బ‌కొట్టేందుకు ఖ‌డ్గ‌మృగం ముందుకు వెళ్లింది. ఏనుగు కూడా అదే స్థాయిలో త‌న బ‌లాన్ని ప్ర‌ద‌ర్శించింది. ఇక క్ష‌ణ కాలంలోనే ఖ‌డ్గ‌మృగాన్ని ఏనుగు కింద‌ప‌డేంది. త‌న బ‌ల‌మైన తొండెంతో ఖ‌డ్గ‌మృగాన్ని నొక్కిపెట్టింది. ఇక ఏనుగు దెబ్బ‌కు ఖ‌డ్గ‌మృగం అక్క‌డ్నుంచి పారిపోయింది.