Viral Video | 12 అడుగుల నాగుపాముతో.. 6 ఏండ్ల బాలుడి ఆట‌లు

Viral Video | ఈ భూమ్మీద అత్యంత విష‌పూరిత‌మైన స‌ర్పాల్లో నాగుపాము ఒక‌టి. ఈ పాము కాటు వేసిందంటే చాలు క్ష‌ణాల్లో ప్రాణాలు కోల్పోవ‌డం ఖాయం. అంత‌టి విష‌పూరిత‌మైన పాముతో.. ఓ ఆరేండ్ల బాలుడు ఆడిన ఆట సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. క‌ర్ణాట‌కలోని ఉత్త‌ర క‌న్న‌డ జిల్లాలోని సిర్సి అనే గిరిజ‌న ప్రాంతంలోకి 12 అడుగుల పొడ‌వున్న నాగుపాము వ‌చ్చింది. ఇక ఆ పామును 6 ఏండ్ల బాలుడు విరాజ్ ప్ర‌శాంత్ ధైర్యంగా ప‌ట్టుకున్నాడు. నాగుపాము […]

Viral Video | 12 అడుగుల నాగుపాముతో.. 6 ఏండ్ల బాలుడి ఆట‌లు

Viral Video | ఈ భూమ్మీద అత్యంత విష‌పూరిత‌మైన స‌ర్పాల్లో నాగుపాము ఒక‌టి. ఈ పాము కాటు వేసిందంటే చాలు క్ష‌ణాల్లో ప్రాణాలు కోల్పోవ‌డం ఖాయం. అంత‌టి విష‌పూరిత‌మైన పాముతో.. ఓ ఆరేండ్ల బాలుడు ఆడిన ఆట సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

క‌ర్ణాట‌కలోని ఉత్త‌ర క‌న్న‌డ జిల్లాలోని సిర్సి అనే గిరిజ‌న ప్రాంతంలోకి 12 అడుగుల పొడ‌వున్న నాగుపాము వ‌చ్చింది. ఇక ఆ పామును 6 ఏండ్ల బాలుడు విరాజ్ ప్ర‌శాంత్ ధైర్యంగా ప‌ట్టుకున్నాడు. నాగుపాము ప‌డ‌గ విప్పి బుస‌లు కొడుతుండ‌గా, దాని తోక ప‌ట్టుకుని బాలుడు ఎంజాయ్ చేశాడు.

ఈ దృశ్యాన్ని వీక్షించేందుకు స్థానికులంతా పాముకు 20 అడుగుల దూరంలో ఉండిపోయారు. అయితే నాగుపాము బాలుడికి ఎలాంటి హానీ కలిగించ‌లేదు. ఈ వీడియోను సుభాష్ చంద్ర ఎన్ఎస్ అనే ట్విట్ట‌ర్ యూజ‌ర్ త‌న ఖాతాలో షేర్ చేశాడు.

అయితే బాలుడి చ‌ర్య‌పై ప‌లువురు నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. విష‌పూరిత స‌ర్పాల పట్ల పిల్ల‌లు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని హెచ్చ‌రించారు. ఇలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డిన వారిని, ప్రోత్స‌హించిన వారిని జైల్లో వేయాల‌ని నెటిజ‌న్లు సూచించారు.