Cat Birthday | ఘనంగా పిల్లి బర్త్ డే వేడుకలు.. వీడియో వైరల్
Cat Birthday | జంతు ప్రేమికులు పెంపుడు జంతువులను తమ కుటుంబ సభ్యులుగానే భావిస్తారు. తమ బిడ్డలతో సమానంగా ఆ పెంపుడు జంతువులను పెంచుకుంటారు. అయితే ఓ మహిళ తన పెంపుడు పిల్లి బర్త్ డే వేడుకలను ఘనంగా నిర్వహించింది. తమ పిల్లల బర్త్‌డే ఏ విధంగానైతే చేస్తామో ఆ మాదిరిగానే బెలూన్స్ కట్టి, డెకరేషన్ చేసింది. పిల్లిని ఓ దిండు మధ్యలో కూర్చొబెట్టి.. కేక్ కట్ చేయించింది. ఆ తర్వాత చిల్ అవుతూ.. మహిళతో పాటు […]
Cat Birthday | జంతు ప్రేమికులు పెంపుడు జంతువులను తమ కుటుంబ సభ్యులుగానే భావిస్తారు. తమ బిడ్డలతో సమానంగా ఆ పెంపుడు జంతువులను పెంచుకుంటారు. అయితే ఓ మహిళ తన పెంపుడు పిల్లి బర్త్ డే వేడుకలను ఘనంగా నిర్వహించింది.
తమ పిల్లల బర్త్‌డే ఏ విధంగానైతే చేస్తామో ఆ మాదిరిగానే బెలూన్స్ కట్టి, డెకరేషన్ చేసింది. పిల్లిని ఓ దిండు మధ్యలో కూర్చొబెట్టి.. కేక్ కట్ చేయించింది. ఆ తర్వాత చిల్ అవుతూ.. మహిళతో పాటు కుటుంబ సభ్యులంతా ఎంజాయ్ చేశారు.
పిల్లి బర్త్ డే వేడుకలను నిర్వహించిన మహిళపై జంతు ప్రేమికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. పెంపుడు జంతువుల పట్ల ఆమె చూపిస్తున్న ప్రేమ ఎంతో గొప్పదని కొనియాడుతున్నారు. ఇలాంటి వారిని ఇష్టపడటంలో తప్పులేదని అంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
View this post on Instagram
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram