Hero Nithin| కొడుకు తొలి బర్త్ డే వేడుకల్లో హీరో నితిన్ సందడి

విధాత : హీరో నితిన్ (Nithin)తన కొడుకు అవ్యుత్(Avyukth) తొలి బర్త్ డే వేడుక(Birthday Celebrations)ల్లో సందడి చేశారు. లిటిల్ ప్రిన్స్ అవ్యుత్ ముద్దుల ఫోటోను ఆయన ఎక్స్ లో పోస్టు చేసి బర్త్ డే విషెస్ తెలిపారు. అవ్యుక్త్ మొదటి పుట్టినరోజు వేడుక ఎలాంటి హడావుడి లేకుండా జరిగింది. నితిన్, ఆయన భార్య శాలినీ సహా కొద్ది మంది గెస్టులు, సన్నిహితుల మధ్య ఈ వేడుకను నిర్వహించారు. జయం సినిమాతో టాలీవుడ్ కు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన నితిన్ రెడ్డి ఆ తర్వాత దిల్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. సంబరం..శ్రీ ఆంజనేయం..రాజమౌళి దర్శకత్వంలో సై మూవీలో..త్రివిక్రమ్ ఆఆ చిత్రంతో అలరించినప్పటికి..కెరీర్ లో 13వరుస ప్లాప్ లు అందుకున్నాడు.
‘భీష్మ’ తర్వాత నితిన్ కు సరైన హిట్టు లేదు. ‘రంగ్ దే’ కొంతలో కొంత బెటర్. తర్వాత ‘చెక్’ ‘మాచర్ల నియోజకవర్గం’ ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ ‘రాబిన్ హుడ్’ ‘తమ్ముడు’ వంటి సినిమాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. ఇండస్ట్రీలో ఎనిమిదేళ్ల పాటు హిట్టు లేకపోయినా ప్రస్తుతం చేతిలో మరో రెండు సినిమాలు ఉన్నాయి. తనకు ఇష్క్ వంటి హిట్ ఇచ్చిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. గుర్రపుస్వారీ ప్రధానంగా సాగే ఈ సినిమాకు ‘స్వారీ’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. హీరోయిన్ గా పూజాహెగ్డే ఖరారైంది. ఇక బలగం డైరక్టర్ వేణు దర్శకత్వంలో ఎల్లమ్మ అనే సినిమా చేస్తున్నారు.