Telangana University | తెలంగాణ యూనివర్సిటీలో మరోసారి విజిలెన్స్ దాడులు
విధాత, నిజామాబాద్, ప్రతినిధి: నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి లోని తెలంగాణ యూనివర్సిటీ (Telangana University)లో మరోసారి విజిలెన్స్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల దాడులు చేపట్టారు. 6వ తేదీన ఓ సారి ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు చేసి పలు ఫైళ్లను పట్టుకెళ్లగా మరోసారి ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి ఆరుగురు అధికారులు బృందం ఇంజినీరింగ్ సెక్షన్, ఎగ్జామినేషన్ సెక్షన్, బిల్డింగ్ సెక్షన్, ఏవో కార్యాలయంలో సోదాలు చేస్తున్నారు. యూనివర్సిటీలో గత కొంత కాలంగా అక్రమాలపై వెల్లువెత్తుతున్నఆరోపణల […]
విధాత, నిజామాబాద్, ప్రతినిధి: నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి లోని తెలంగాణ యూనివర్సిటీ (Telangana University)లో మరోసారి విజిలెన్స్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల దాడులు చేపట్టారు.
6వ తేదీన ఓ సారి ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు చేసి పలు ఫైళ్లను పట్టుకెళ్లగా మరోసారి ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి ఆరుగురు అధికారులు బృందం ఇంజినీరింగ్ సెక్షన్, ఎగ్జామినేషన్ సెక్షన్, బిల్డింగ్ సెక్షన్, ఏవో కార్యాలయంలో సోదాలు చేస్తున్నారు.
యూనివర్సిటీలో గత కొంత కాలంగా అక్రమాలపై వెల్లువెత్తుతున్నఆరోపణల నేపథ్యంలో ఫైళ్ళను పరిశీలిస్తున్నారు. వీసీ, రిజిస్ట్రార్లు వర్సిటీకి రాలేదు. యూనివర్సిటీలో అక్రమ నియామకాలు అక్రమ లావాదేవీలు జరిగాయని ఈసీ కమిటీ ఫిర్యాదుతో సోదాలు జరుగుతున్నాయి.
X


Google News
Facebook
Instagram
Youtube
Telegram