Samantha | సినిమాల్లో సమంత చాఫ్టర్ క్లోజ్ అయినట్టేనా.. రౌడీ ఇచ్చే హింట్ ఇదేనా?

Samantha | విధాత‌: సినిమా ప్రపంచంలో ఒక్కొక్కరూ ఒక్కో విధంగా తమ సినిమాలను ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. ఈమధ్య సమంత ఆరోగ్యం సరిగా ఉండని కారణంగా ఆమె చాలా సినిమా ఆఫర్లను వదులుకుంది. అలాగే చికిత్స కోసం ప్రశాంతంగా ఉండాలని సినిమాల ఒత్తిడిని దూరం పెట్టింది. అయితే సమంత విషయంలో ఏం చేసినా అది వైరల్ అవుతూనే ఉంది. ‘శాకుంతలం’ చిత్రానికి ముందు కూడా సెలైన్ ఎక్కించుకుంటూ డబ్బింగ్ చెబుతున్నానంటూ సమంత తన ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్ చేసిన […]

  • Publish Date - August 21, 2023 / 01:47 AM IST

Samantha |

విధాత‌: సినిమా ప్రపంచంలో ఒక్కొక్కరూ ఒక్కో విధంగా తమ సినిమాలను ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. ఈమధ్య సమంత ఆరోగ్యం సరిగా ఉండని కారణంగా ఆమె చాలా సినిమా ఆఫర్లను వదులుకుంది. అలాగే చికిత్స కోసం ప్రశాంతంగా ఉండాలని సినిమాల ఒత్తిడిని దూరం పెట్టింది. అయితే సమంత విషయంలో ఏం చేసినా అది వైరల్ అవుతూనే ఉంది.

‘శాకుంతలం’ చిత్రానికి ముందు కూడా సెలైన్ ఎక్కించుకుంటూ డబ్బింగ్ చెబుతున్నానంటూ సమంత తన ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్ చేసిన ఫోటో వైరల్ అయింది. ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండ లాంటి హీరో సమంత ఆరోగ్యం గురించి మాట్లాడటం అంటే దానిని మూవీ ప్రమోషన్స్ కోసం సింపతీ క్రియేట్ చేస్తున్నాడనుకోవాలా? లేక నిజంగానే సమంత మీద సింపతీతో అన్నాడా? అనేది ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే..

కొంత కాలంగా సమంత సినిమాలకు దూరంగా ఉంటూ వస్తుంది. తన అనారోగ్యం కారణంగా మయోసైటిస్ వ్యాధి వల్ల సిక్ అయిన సమంత.. ఈ నిర్ణయం తీసుకుంది. ఇంత అనారోగ్యంలోనూ తను ఇప్పటివరకూ ఒప్పుకున్న సినిమాలన్నీ పూర్తి చేసింది. వీటితోపాటే వెబ్ సిరీస్‌లు కూడా పూర్తి చేసింది.

బాలీవుడ్‌లో ఫ్యామిలీ మేన్ 2 మంచి పేరు తెచ్చింది. అలాగే ఈ మధ్య చేసిన సిటాడెల్ వెబ్ సిరీస్ అయితే ఇంకా ప్రేక్షకుల ముందుకు రాలేదు. అందులోనూ సమంత పాత్ర సినీ లవర్స్‌ని మాంచి కిక్ ఇవ్వబోతుందనేలా టాక్ వినబడుతోంది.

ఇక పూర్తి చేసిన సినిమాల్లో ‘ఖుషి’ సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో కోసం.. అమెరికా వెళ్ళి అక్కడే రెస్ట్‌లో ఉన్న సమంత మళ్ళీ ఇండియాకు వచ్చింది. లేటెస్ట్‌గా ఖుషి ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన మూజికల్ ఫెస్ట్‌లో సమంత అందంగా కనిపించింది. ఈ సమయంలోనే సింగర్ చిన్మయి, హీరో విజయ్ దేవరకొండ కూడా సమంత ఆరోగ్యం గురించి మాట్లాడారు.

ఆమె ఆరోగ్యం గురించి చెప్పకూడదనుకున్నాను కానీ.. తన కష్టం చూస్తూంటే చెప్పేయాలనిపిస్తుంది. సమంత పైకి నవ్వుతూ కనిపిస్తున్నా లోపల చాలా బాధను అనుభవిస్తుంది. మీ అందరి అభిమానం కోసమే వచ్చింది కానీ.. స్టేజ్ పైన కాసేపు కూడా నిలబడలేక పోతుంది.

లైటింగ్ చూసినా ఆమెకు ఇబ్బందే.. కళ్ళు ఎర్రగా మారిపోతాయి. మంట పుడతాయి. దానికి తోడు తీవ్రమైన తలపోటు కూడా ఉంటుంది.. అని విజయ్ చెప్పడంతో ఇది వేరే విధంగా కన్వే అయింది. కొందరైతే ఇదంతా మూవీ ప్రమోషన్స్ కోసం, సింపతీ క్రియేట్ చేస్తున్నాడని కొందరు.. ఇకపై సమంతతో నిర్మాతలు సినిమాలు తీయడానికి భయపడేలా చెబుతున్నారంటూ.. భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Latest News