విజయ్ ‘దేవర శాంటా’ గిఫ్ట్‌పై.. రకరకాల కామెంట్స్

విధాత‌: టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తన అభిమానులను వెకేషన్‌కు పంపిస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. గత ఐదేళ్లుగా దేవర శాంటా పేరుతో ఫ్యాన్స్‌కి న్యూ ఇయర్ బహుమతులు ఇస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఈ సంవత్సరం 100 మంది అభిమానులను ఒక ఫ్రీ వెకేషన్ హాలిడే‌కి పంపిస్తున్నట్టు ప్రకటించాడు. అంతేకాదు ఆ వెకేషన్‌లో ఎక్కడికి వెళ్లాలి అనుకుంటారు అనేది కూడా అభిమానుల ఛాయిస్‌కే వదిలేశాడు విజయ్ దేవరకొండ. అందుకోసం ఫ్యాన్స్‌కి నాలుగు ఆప్షన్స్ […]

  • By: krs    latest    Jan 10, 2023 10:13 AM IST
విజయ్ ‘దేవర శాంటా’ గిఫ్ట్‌పై.. రకరకాల కామెంట్స్

విధాత‌: టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తన అభిమానులను వెకేషన్‌కు పంపిస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. గత ఐదేళ్లుగా దేవర శాంటా పేరుతో ఫ్యాన్స్‌కి న్యూ ఇయర్ బహుమతులు ఇస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఈ సంవత్సరం 100 మంది అభిమానులను ఒక ఫ్రీ వెకేషన్ హాలిడే‌కి పంపిస్తున్నట్టు ప్రకటించాడు.

అంతేకాదు ఆ వెకేషన్‌లో ఎక్కడికి వెళ్లాలి అనుకుంటారు అనేది కూడా అభిమానుల ఛాయిస్‌కే వదిలేశాడు విజయ్ దేవరకొండ. అందుకోసం ఫ్యాన్స్‌కి నాలుగు ఆప్షన్స్ ఇచ్చాడు. మౌంటెన్స్ ఆఫ్ ఇండియా, బీచెస్ ఆఫ్ ఇండియా, కల్చర్ ట్రిప్ ఆఫ్ ఇండియా, రిసార్ట్స్ ఇన్ ఇండియా.. ఈ నాలుగు ఆప్షన్స్ లో ఎక్కడికి టూరు వెళ్లాలన్న విజయ్ దేవరకొండ పూర్తి ఉచితంగా పంపించబోతున్నాడు.

ఈ ఆప్షన్స్‌లో ఎక్కువ మంది అభిమానులు మౌంటెన్స్ ఆఫ్ ఇండియాకు ఓటేశారు. దీంతో ఈ ఏడాది దేవర శాంటా బహుమతి నేపథ్యంలో 100 మంది ఫ్యాన్స్‌ని కులుమనాలి పంపించడానికి నిర్ణయం తీసుకున్నాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక వీడియో చేశాడు.

ఎక్కువ మంది మౌంటెన్స్‌కు వెళ్దాం అంటూ ఓటు వేశారు. కాబట్టి మీలో వంద మందిని అన్ని ఖర్చులతో నేనే కులుమనాలి పంపించబోతున్నాను. ఇక మీలో వందమంది నేను ఎంపిక చేయాలి కాబట్టి 18 ఏళ్లు దాటిన వారంతా దేవర శాంటా వెబ్సైట్ కి వెళ్లి గూగుల్ డాక్యుమెంట్లు ఫామ్‌ని ఫిల్ చేయండి.. ఆ ఫార్మ్స్ చూసి మీలో వందమందిని ప్రకటిస్తాము అని వెల్లడించాడు.

అయితే ఇదంతా ఒక పబ్లిసిటీ స్టంట్‌లా కనిపిస్తుందని విజయ్ దేవరకొండని కొందరు విమర్శిస్తుండటం విశేషం. తన ఫ్యాన్స్‌ను, ఫాన్ బేస్‌ను పెంచుకోవడం కోసం ఇలాంటివి ప్లాన్ చేస్తున్నాడని.. దీని బదులు ఏదైనా సామాజిక సేవా కార్యక్రమాలకు ఆ డబ్బులు ఖర్చు చేస్తే సమాజానికి ఉపయోగంగా ఉంటుందని కొందరు సూచిస్తున్నారు.

ఏదో హాలిడేలు అంటూ, వెకేషన్ కంటూ 100 మందిని తన సొంత ఖర్చులతో కులుమనాలి పంపించడం కంటే.. ఒక నెల రోజులు పేదలకు అన్నదానం చేస్తే వచ్చే పుణ్యమే బాగుంటుందని.. అలా కాకుండా, ఇలా ప్లాన్ చేయడం అనేది కేవలం యూత్‌ను టార్గెట్ చేసుకొని చేస్తున్న పబ్లిసిటీగా కొందరు కొట్టి పారేస్తున్నారు.