Viral Video | ప‌డ‌గ విప్పి.. బుసలు కొడుతూ.. ట‌మాటాల‌కు కాప‌లాగా నాగుపాము

Viral Video | విధాత‌: ట‌మాటా ధ‌ర‌లు ఆకాశాన్నంటాయి. ట‌మాటా ధ‌ర‌లు కిలో రూ. 100 నుంచి రూ. 200 దాకా ప‌లుకుతుండ‌టంతో.. వాటిని కాపాడుకోవ‌డం అటు రైతులు, ఇటు వ్యాపారులకు స‌వాల్‌గా మారింది. ఈ నేప‌థ్యంలో రైతులు, వ్యాపారులు ట‌మాటాల‌కు ర‌క్ష‌ణ‌గా బౌన్స‌ర్ల‌ను, సెక్యూరిటీ సిబ్బందిని పెట్టుకున్న ఘ‌ట‌న‌ల‌ను అనేకం చూస్తున్నాం. కానీ అందుకు భిన్నంగా ఓ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. ట‌మాటాల‌కు కాప‌లాగా ఓ నాగుపాము ఉండిపోయింది. ప‌డ‌గ విప్పి, బుస‌లు కొడుతూ.. ట‌మాటాల […]

Viral Video | ప‌డ‌గ విప్పి.. బుసలు కొడుతూ.. ట‌మాటాల‌కు కాప‌లాగా నాగుపాము

Viral Video | విధాత‌: ట‌మాటా ధ‌ర‌లు ఆకాశాన్నంటాయి. ట‌మాటా ధ‌ర‌లు కిలో రూ. 100 నుంచి రూ. 200 దాకా ప‌లుకుతుండ‌టంతో.. వాటిని కాపాడుకోవ‌డం అటు రైతులు, ఇటు వ్యాపారులకు స‌వాల్‌గా మారింది. ఈ నేప‌థ్యంలో రైతులు, వ్యాపారులు ట‌మాటాల‌కు ర‌క్ష‌ణ‌గా బౌన్స‌ర్ల‌ను, సెక్యూరిటీ సిబ్బందిని పెట్టుకున్న ఘ‌ట‌న‌ల‌ను అనేకం చూస్తున్నాం.

కానీ అందుకు భిన్నంగా ఓ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. ట‌మాటాల‌కు కాప‌లాగా ఓ నాగుపాము ఉండిపోయింది. ప‌డ‌గ విప్పి, బుస‌లు కొడుతూ.. ట‌మాటాల ద‌గ్గ‌ర‌కు ఎవ‌ర్నీ రానివ్వ‌కుండా ర‌క్ష‌ణ‌గా నిలిచింది ఆ నాగుపాము.

ట‌మాటాల‌కు కాపలాగా ఉన్న నాగుపాము వీడియోను మీర్జా ఎమ్‌డీ ఆరిఫ్ అనే ఒక వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఒక ఇంట్లోని మూల‌కు ట‌మాటాలు ఉంచారు. ఇక వాటి వ‌ద్ద‌కు భారీ నాగుపాము చేరింది. ప‌డ‌గ విప్పిన నాగుపాము బుస‌లు కొడుతూ.. ట‌మాటాల ద‌గ్గ‌ర‌కు ఎవ‌ర్నీ రానివ్వ‌లేదు.

నిధి కంటే విలువైన టమాటాలను పాము రక్షిస్తున్నది అని ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చాడు ఆరీఫ్‌. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. ట‌మాటాలు చాలా ఖ‌రీదైన‌వి.. వాటిని ముట్టుకోవ‌ద్దని కామెంట్లు చేస్తున్నారు. విలువైన ట‌మాటాల‌కు నాగుపాము కాప‌లాగా ఉండ‌డం ఆశ్చ‌ర్యమేస్తుంద‌ని మ‌రొక‌రు రాసుకొచ్చారు.