Viral Video | తాబేలుకు నీళ్లు తాగించిన మహిళ.. మరి తాబేలు ఏం చేసింది?

Viral Video విధాత‌: తాబేలును అత్యంత సాధుజీవిగా పరిగ‌ణిస్తుంటారు. ఏదైనా ప్రమాదం ఉందంటే ముడుచుకుపోతుంది. అది మెల్లగా పాకుతూ ఉంటే చూడముచ్చటవుతుంది. ఎండలో ఏవైనా జీవులు కనిపిస్తే వాటికి నీళ్లు తాగించడం చాలా మంది చేస్తుంటారు. కొన్ని సమయాల్లో అవి సానుకూలంగా స్పందిస్తుంటాయి. సాధుజీవి తాబేలు మాత్రం ఆ మహిళను ఏం చేసిందో తెలుసా? దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ అవుతున్నది. జంతువులు అప్పుడప్పుడు చేసే పనులు ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. అమాయకత్వంతో అవి చేసే పనులు ముచ్చటగొల్పుతాయి. […]

Viral Video | తాబేలుకు నీళ్లు తాగించిన మహిళ.. మరి తాబేలు ఏం చేసింది?

Viral Video

విధాత‌: తాబేలును అత్యంత సాధుజీవిగా పరిగ‌ణిస్తుంటారు. ఏదైనా ప్రమాదం ఉందంటే ముడుచుకుపోతుంది. అది మెల్లగా పాకుతూ ఉంటే చూడముచ్చటవుతుంది. ఎండలో ఏవైనా జీవులు కనిపిస్తే వాటికి నీళ్లు తాగించడం చాలా మంది చేస్తుంటారు. కొన్ని సమయాల్లో అవి సానుకూలంగా స్పందిస్తుంటాయి. సాధుజీవి తాబేలు మాత్రం ఆ మహిళను ఏం చేసిందో తెలుసా? దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ అవుతున్నది.

జంతువులు అప్పుడప్పుడు చేసే పనులు ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. అమాయకత్వంతో అవి చేసే పనులు ముచ్చటగొల్పుతాయి. కానీ.. ఈ తాబేలు మాత్రం విచిత్రంగా ప్రవర్తించింది. దీని చేష్టలు మనకు కూడా ఒక్క క్షణం భయం కలిగిస్తాయి.

ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన ఈ వీడియోలో తాబేలుకు ఒక మహిళ నీళ్లు తాగిస్తూ ఉంటుంది. దాహంతో ఉన్నదేమో.. కాసేపు ప్రశాంతంగా నీళ్లు తాగిన ఆ తాబేలు ఒక్కసారిగా రెచ్చిపోయింది. తనకు నీళ్లు తాగించిన మహిళ వైపు గుర్రు మంటూ చూసి.. ఒక్కసారిగా దాడి చేసేందుకు ప్రయత్నించింది. అయితే.. తాబేలు కంచెకు అవతల ఉండటంతో ఇబ్బందీ ఏమీ కాలేదు.

‘ఈ తాబేలు చాలా దాహంతో ఉన్నది.. కానీ కొద్ది క్షణాల తర్వాత ఏం చేసిందో చూడండి..’ అంటూ ఆ మహిళ ఈ వీడియో కింద రాశారు. దీనిని చూసిన నెటిజన్లు నమ్మలేక పోతున్నామంటూ రియక్టయ్యారు. ఇంత చిన్న జీవి.. ఇలా దాడి చేసేందుకు ప్రయత్నిస్తుందా? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఈ వీడియోను దాదాపు 40 లక్షల మంది చూశారు. దానికి కనీస కృతజ్ఞత లేదంటూ ఒకరు వ్యాఖ్యానిస్తే.. అది నాపైకే వచ్చిందేమో అనిపించిందని మరొకరు రాశారు. ‘ఇంకా నయం.. నేను ఉలికిపాటుతో నా ఫోన్‌ కింద పడేసుకోలేదు’ అని ఇంకొకరు సరదాగా వ్యాఖ్యానించారు. ‘ఇక చాలు.. అని ఆ మహిళకు తాబేలు చెప్పాలనుకుందేమో’ అని ఒకరు కామెంట్‌ పెట్టారు.

https://twitter.com/StrangestMedia/status/1656109016622288896?s=20