సీనియర్ లాయర్‌పై దాడి చేసిన మహిళా న్యాయవాది
ఢిల్లీ హైకోర్టు క్యాంటీన్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇద్దరు మహిళా లాయర్ల మధ్య నెలకొన్న వివాదం తీవ్ర ఘర్షణకు దారి తీసింది

న్యూఢిల్లీ : ఢిల్లీ హైకోర్టు క్యాంటీన్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇద్దరు మహిళా లాయర్ల మధ్య నెలకొన్న వివాదం తీవ్ర ఘర్షణకు దారి తీసింది. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షి తెలిపారు.
ఢిల్లీ హైకోర్టులోని లాయర్లందరూ.. అక్కడున్న క్యాంటీన్‌లో భోజనాలు చేస్తున్నారు. అంతలోనే ఓ మహిళా లాయర్ క్యాంటీన్‌లోకి ప్రవేశించింది. రావడంతోనే అరుస్తూ ఓ టేబుల్‌పై ఉన్న ఫుడ్‌ను విసిరేసింది. దీంతో అక్కడున్న ఇతర లాయర్లపై ఆహార పదార్థాలు పడిపోయాయి.
ఇక ఓ సీనియర్ మహిళా న్యాయవాది.. ఆమెను శాంతింపజేసేందుకు యత్నించారు. కానీ ఆమె పట్టించుకోకుండా.. సీనియర్ లాయర్‌పై దాడి చేసింది. దీంతో సీనియర్ న్యాయవాది నిరసన వ్యక్తం చేశారు.