Virat Kohli | ఏంటి.. త‌న ఫామ్ హౌజ్‌లో విరాట్ ఏకంగా క్రికెట్ పిచ్ ఏర్పాటు చేసుకున్నాడా..!

Virat Kohli | భార‌త స్టైలిష్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ గురించి ఇటీవ‌ల నెట్టింట తెగ వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. కొన్ని వార్త‌ల‌కి విరాట్ స్పందిస్తున్నా, మ‌రి కొన్ని వార్త‌ల‌ని మాత్రం లైట్ తీసుకుంటున్నాడు. కొద్ది రోజుల క్రితం విరాట్ కోహ్లీ క్రికెట్ క‌న్నా కూడా సోష‌ల్ మీడియా ద్వారా ఎక్కువ సంపాదిస్తున్నాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఒక్కో పోస్టుకి కోహ్లీకి రూ.11.45 కోట్ల ఆదాయం వస్తోందని ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ కావ‌డం తో, […]

  • By: sn    latest    Aug 17, 2023 3:48 AM IST
Virat Kohli | ఏంటి.. త‌న ఫామ్ హౌజ్‌లో విరాట్ ఏకంగా క్రికెట్ పిచ్ ఏర్పాటు చేసుకున్నాడా..!

Virat Kohli |

భార‌త స్టైలిష్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ గురించి ఇటీవ‌ల నెట్టింట తెగ వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. కొన్ని వార్త‌ల‌కి విరాట్ స్పందిస్తున్నా, మ‌రి కొన్ని వార్త‌ల‌ని మాత్రం లైట్ తీసుకుంటున్నాడు. కొద్ది రోజుల క్రితం విరాట్ కోహ్లీ క్రికెట్ క‌న్నా కూడా సోష‌ల్ మీడియా ద్వారా ఎక్కువ సంపాదిస్తున్నాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది.

ఒక్కో పోస్టుకి కోహ్లీకి రూ.11.45 కోట్ల ఆదాయం వస్తోందని ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ కావ‌డం తో, ఆ వార్త‌ని ట్విట్టర్ ద్వారా కొట్టిపారేశాడు విరాట్ కోహ్లీ. నేను సంపాదించిన దానికి సంతోషంగానే ఉన్నాను. కానీ సోష‌ల్ మీడియాలో సంపాద‌న గురించి వ‌స్తున్న వార్త‌లు అవాస్త‌వం అంటూ కోహ్లీ త‌ప్పుడు వార్త‌ల‌కి చెక్ పెట్టాడు.

ఇక కోహ్లీకి సంబంధించిన మ‌రో వార్త ఇప్పుడు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. విరాట్ కోహ్లీకి ముంబైలో, గురుగ్రామ్‌లో ఇళ్లు ఉండ‌గా, కొన్ని నెలల క్రితం అలిబాగ్‌లోని జిరడ్ అనే గ్రామంలో త‌న స‌తీమ‌ణి అనుష్క శర్మ కలిసి 8 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశాడు. ఇందులో 2 ఎకరాల్లో విశాలమైన, విలాస వంతమైన ఫామ్‌హౌజ్‌ని కూడా నిర్మించబోతున్నారట‌.

దానికి దాదాపు రూ.20 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంద‌ట. ఇటీవ‌ల వెస్టిండీస్ పర్యటన ముగించుకొని ఇండియాకి వ‌చ్చిన వచ్చిన తర్వాత అలిబాగ్‌లో ఫామ్ హౌజ్ నిర్మాణ పనులను సమీక్షించారు విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు. ఇక ఈ ఫామ్‌ హౌజ్‌లో విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ చేయడానికి వీలుగా ఓ క్రికెట్ పిచ్ కూడా రూపొందించుకోబోతున్న‌ట్టు ప్రముఖ ఇంగ్లీష్ వెబ్‌సైట్ టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించింది.

దీంతో చిర్రెత్తుకొచ్చిన కోహ్లీ త‌నదైన స్టైల్‌లో స్పందించాడు. నేను చిన్న‌ప్ప‌టి నుండి చ‌దువుతున్న ప‌త్రిక‌లు ఇలా త‌ప్పుడు వార్త‌లు ప్ర‌చురించ‌డం స్టార్ట్ చేశాయి అంటూ త‌ల ప‌ట్టుకున్న ఎమోజీల‌ని ఇన్‌స్టా స్టేట‌స్‌గా పెట్టుకున్నాడు విరాట్. కాగా, 34 ఏళ్ల విరాట్ కోహ్లీ, ప్రస్తుతం కుటుంబంతో కలిసి విలువైన సమయాన్ని గడుపుతున్నాడు.

ఈ నెల 24న ఆసియా కప్ 2023 టోర్నీ కోసం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఏర్పాటు చేసే క్యాంపులో పాల్గొనే విరాట్ కోహ్లీ, ఆ తర్వాత టీమ్‌తో పాటు లంకకు వెళ్ల‌నున్నాడు. రానున్న రోజుల‌లో ఆసియా క‌ప్, వ‌ర‌ల్డ్ క‌ప్ ఉండ‌గా, వాటి కోసం ఫిట్‌నెస్ కాపాడుకొనే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు.