Virat Kohli | విరాట్‌కి వ‌జ్రాల‌తో పొదిగిన బ్యాట్.. ఎవ‌రు ఇవ్వ‌నున్నారో తెలిస్తే షాక‌వుతారు..!

Virat Kohli | ప్ర‌పంచ క్రికెట్‌లో స‌చిన్ త‌ర్వాత అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన క్రికెట‌ర్ ఎవ‌రంటే విరాట్ కోహ్లీ అని గట్టిగా చెప్పొచ్చు. నిల‌క‌డ‌గా రాణిస్తూ క్రికెట్‌లో ఎన్నో రికార్డుల‌ని త‌న పేరిట లిఖించుకున్నాడు. వెస్టిండీస్ టూర్ త‌ర్వాత విరాట్ తన ఫ్యామిలీతో క‌లిసి విలువైన స‌మ‌యాన్ని గ‌డుపుతున్నాడు. అలీబాగ్‌లో తన ఫామ్‌హౌజ్ నిర్మాణ పనులను సమీక్షిస్తూనే కొన్ని ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌లో పాల్గొంటున్నాడు. మ‌రి కొద్ది రోజుల‌లో ఆసియా క‌ప్ 2023 ట్రోఫీ జ‌ర‌గ‌నుండ‌గా, దీని ప్రిపరేషన్స్‌ […]

  • By: sn    latest    Aug 20, 2023 5:10 AM IST
Virat Kohli | విరాట్‌కి వ‌జ్రాల‌తో పొదిగిన బ్యాట్.. ఎవ‌రు ఇవ్వ‌నున్నారో తెలిస్తే షాక‌వుతారు..!

Virat Kohli |

ప్ర‌పంచ క్రికెట్‌లో స‌చిన్ త‌ర్వాత అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన క్రికెట‌ర్ ఎవ‌రంటే విరాట్ కోహ్లీ అని గట్టిగా చెప్పొచ్చు. నిల‌క‌డ‌గా రాణిస్తూ క్రికెట్‌లో ఎన్నో రికార్డుల‌ని త‌న పేరిట లిఖించుకున్నాడు. వెస్టిండీస్ టూర్ త‌ర్వాత విరాట్ తన ఫ్యామిలీతో క‌లిసి విలువైన స‌మ‌యాన్ని గ‌డుపుతున్నాడు. అలీబాగ్‌లో తన ఫామ్‌హౌజ్ నిర్మాణ పనులను సమీక్షిస్తూనే కొన్ని ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌లో పాల్గొంటున్నాడు.

మ‌రి కొద్ది రోజుల‌లో ఆసియా క‌ప్ 2023 ట్రోఫీ జ‌ర‌గ‌నుండ‌గా, దీని ప్రిపరేషన్స్‌ కోసం బెంగళూరులో బీసీసీఐ ఏర్పాటు చేసే క్యాంపులో పాల్గొననున్నాడు విరాట్. అయితే వ‌ర‌ల్డ్ క‌ప్ ముందు విరాట్ కోసం సూర‌త్‌కి చెందిన వ్యాపార‌వేత్త వజ్రాలతో పొదిగిన బ్యాటును రూపొందించి అతనికి గిఫ్ట్‌గా ఇవ్వాల‌ని అనుకుంటున్నాడ‌ట‌.

సూరత్ కి చెందిన‌ వ్యాపారవేత్త.. బ్యాట్ కోసం కొన్ని నెలల పాటు శ్రమించి 1.04 క్యారెట్ల ఒరిజినల్ డైమండ్లను వాడాడు.. ఈ బ్యాటు ఖరీదు దాదాపు రూ.10 లక్షల వరకూ ఉంటుంద‌ని తెలుస్తుండ‌గా, ఇప్పటికే ఈ డైమండ్ బ్యాటు తయారీ పూర్తి చేశాడు.

సర్టిఫికేషన్ కోసం సూరత్‌లోని లెక్సస్ సాఫ్ట్‌మ్యాక్ కంపెనీకి పంపిన‌ట్టు స‌మాచారం. దీని సైజు 15 మిల్లీ మీటర్ల నుంచి 5 మిల్లిమీటర్ల వరకూ ఉంటుందని స‌మాచారం. ఈ బ్యాట్ కోసం ల్యాబ్‌లో తయారుచేసిన డైమండ్స్ కాకుండా సహజసిద్ధమైన వజ్రాలను ఆ వ్యాపార‌వేత్త వాడారు. అతి తొంద‌ర‌లోనే ఆ బ్యాట్‌ని విరాట్ కోహ్లీకి బ‌హుమ‌తిగా ఇవ్వ‌బోతున్న‌ట్టు తెలుస్తుంది.

ఇక ఆసియా కప్ 2023 టోర్నీ కోసం భార‌త్ శ్రీలంక వెళ్ల‌నుండ‌గా, టీంతో క‌లిసి విరాట్ కూడా వెళ్ల‌నున్నాడు. త‌ర్వాత స్వదేశంలో ఆసీస్ తో వ‌న్డే సిరీస్ ఆడ‌నున్నాడు.అనంత‌రం 2023 వార్మప్ మ్యాచులు ప్రారంభం కానుండ‌గా, విరాట్ ఈ మ్యాచ్‌లు కూడా ఆడ‌నున్నాడు.

అయితే వ‌న్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో భాగంగా అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగనుండ‌గా, ఈ మ్యాచ్ సమయంలో విరాట్ కోహ్లీకి ఈ డైమండ్ బ్యాటును బహుకరించాలని సూరత్ వ్యాపారి భావిస్తున్నాడ‌ట‌. దీనిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది.