వర్కింగ్ జర్నలిస్టులను బలి పశువులను చేయకండి : సీనియర్ జర్నలిస్టు కట్టా శేఖర్ రెడ్డి
ఎన్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ లో ప్రసారమైన ఒక కథనం కేసులో వర్కింగ్ జర్నలిస్టులను బలి పశువులు చేయవద్దని, తక్షణమే వారిని విడుదల చేయాలని సీనియర్ జర్నలిస్టు కట్టా శేఖర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
విధాత, హైదరాబాద్ : ఎన్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ లో ప్రసారమైన ఒక కథనం కేసులో వర్కింగ్ జర్నలిస్టులను బలి పశువులు చేయవద్దని, తక్షణమే వారిని విడుదల చేయాలని సీనియర్ జర్నలిస్టు కట్టా శేఖర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రాజకీయ నాయకుల అంతర్గత కుమ్ములాటలు, ఆధిపత్య పోరులో వృత్తి ధర్మంలో భాగంగా విధులు నిర్వర్తిస్తున్న జర్నలిస్టులను బలి చేయవద్దని సూచించారు. ఈ వార్తల వ్యాప్తికి మూలం ఎవరు, బయటకు పొక్కడానికి అసలు కారకులు ఎవరు అనేది బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో ప్రజా సమస్యలపై గళమెత్తిన ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుని ఎడా పెడా కేసులు నమోదు చేశారని, ఈ ప్రభుత్వంలో జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. ఈ వార్తా కథనాల వెనకాల ఎవరున్నారనేది లోతుగా విచారించి, నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని శేఖర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. మొత్తం ఈ వ్యవహారంలో వర్కింగ్ జర్నలిస్టులే బాధ్యులవుతున్నారని శేఖర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram