INSV Koundinya| గమ్యం చేరిన ఐఎన్ఎస్వీ కౌండిన్య తెర చాప నౌక

ప్రాచీన భారతదేశం నౌక నిర్మాణా నైపుణ్యానికి ప్రతీక ఐఎన్ఎస్వీ కౌండిన్య తెరచాప నౌక తన తొలి విదేశీ సముద్ర యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఐఎన్‌ఎస్‌వి కౌండిన్య గుజరాత్‌లోని పోర్‌బందర్ నుండి తన తొలి విదేశీ యాత్రను పూర్తి చేసుకున్న తర్వాత మస్కట్‌లోని పోర్ట్ సుల్తాన్ ఖాబూస్‌లో లంగరు వేసింది.గుజరాత్‌లోని పోర్‌బందర్ నుండి ఒమన్‌లోని మస్కట్‌కు తన ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా జల వందనం అందుకుంది.

INSV Koundinya| గమ్యం చేరిన ఐఎన్ఎస్వీ కౌండిన్య తెర చాప నౌక

విధాత: ప్రాచీన భారతదేశం నౌక నిర్మాణా నైపుణ్యానికి ప్రతీక ఐఎన్ఎస్వీ కౌండిన్య తెరచాప నౌక తన తొలి విదేశీ సముద్ర యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఐఎన్‌ఎస్‌వి కౌండిన్య గుజరాత్‌లోని పోర్‌బందర్ నుండి తన తొలి విదేశీ యాత్రను పూర్తి చేసుకున్న తర్వాత మస్కట్‌లోని పోర్ట్ సుల్తాన్ ఖాబూస్‌లో లంగరు వేసింది.గుజరాత్‌లోని పోర్‌బందర్ నుండి ఒమన్‌లోని మస్కట్‌కు తన ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా జల వందనం అందుకుంది. ఇది 29 డిసెంబర్ 2025న గుజరాత్‌లోని పోర్‌బందర్ నుండి బయలుదేరింది.మస్కట్‌లో లంగరు వేసిన తర్వాత ఐఎన్‌ఎస్‌వి కౌండిన్య సిబ్బంది సంబరాలు చేసుకున్నారు.

ప్రాచీన కాలంలో భారతదేశం నుండి ఆగ్నేయాసియాకు ప్రయాణించిన తొలి నావికుడు కౌండిన్య పేరు మీద పునః సృష్టి జరుపుకున్న ఐఎన్ఎస్వీ కౌండిన్యను రెండేళ్లపాటు నిర్మించారు. అజంతా గుహల్లో లభ్యమైన 5వ శతాబ్దపు పెయింటింగ్స్ లోని ఓ నౌక చిత్రాన్ని ఆసరాగా చేసుకుని భారత నేవీ ఇంజినీర్లు 1500 ఏళ్ల క్రితం నాటి నౌక నిర్మాణ కౌశలాన్ని చాటుతూ ఐఎన్ఎస్వీ కౌండిన్యను పునః సృష్టి చేశారు. భారత నౌకాదళం నిపుణులు ఎలాంటి ఆధునిక సాంకేతికతను వాడకుండా..పూర్తిగా పురాతన కుట్టు పద్ధతిలో నిర్మించిన నౌక ఐఎన్‌ఎస్‌వీ కౌండిన్యలో 18 మంది నావికులతో 18 రోజుల్లో 1400 కిలోమీటర్లు ప్రయాణించి ఒమన్‌ చేరుకుంది.

ఎలాంటి లోహాలు, మేకులు, బోల్టులు లేకుండా కౌండిన్య నౌకను పూర్తిగా చెక్కలను వాడి తయారు చేశారు. కొబ్బరి పీచుతో అల్లిన తాళ్లతో, జిగురుతో చెక్కలను అనుసంధానం చేసి నిర్మించారు. దీంతో ఈ నౌకను ‘స్టిచ్డ్‌ షిప్‌’గా కూడా పిలుస్తున్నారు. 1500 ఏళ్ల క్రితం నాటి టెక్నిక్స్‌ను ఉపయోగించి ఈ ఆధునికయుగంలో ఎలాంటి యంత్రాల అవసరం లేకుండా చేతులతో నిర్మించడం విశేషం. సముద్ర ఉప్పునీటి నుంచి రక్షణ కోసం దీనికి సహజసిద్ధ జిగురుపూతను, నూనెలు పూశారు. ఈ నౌక ఇంజిన్‌ కు బదులుగా.. తెరచాపల సహాయంతో ప్రయాణించేలా రూపొందించారు. ఈ నౌకకు కదంబ పాలకుల రాజలాంఛనంగా ఉన్న గండభేరుండ చిత్రం, ఒక తెరచాపపై సూర్యుడి ఆకృతి ఏర్పాటు చేశారు. ముందు భాగంలో సింహ యాళి ప్రతిరూపాన్ని తీర్చిదిద్దారు. హరప్పా శైలికి ప్రతికగా కనిపించే లంగరు బొమ్మను డెక్‌పై ఏర్పాటు చేశారు.