వడ్డీ చెల్లించలేదని.. బాధితుడి భార్యపై లైంగికదాడి
Gujarat | అప్పులు తీసుకుంటాం.. ఆ తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తుంటాం. కొన్ని సందర్భాల్లో అప్పు, వడ్డీ చెల్లించడం కొంత ఆలస్యం కావొచ్చు. అలాంటప్పుడు ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను వడ్డీ వ్యాపారులు తీసుకెళ్లిన సందర్భాలు చూశాం. కానీ ఈ వడ్డీ వ్యాపారి మాత్రం బాధితుడి భార్యపై కన్నేశాడు. వడ్డీ చెల్లించలేదని బాధితుడి భార్యపై అనేకసార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన గుజరాత్ రాజ్‌కోట్ జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఆటో డ్రైవర్‌గా జీవితాన్ని కొనసాగిస్తున్న […]

Gujarat | అప్పులు తీసుకుంటాం.. ఆ తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తుంటాం. కొన్ని సందర్భాల్లో అప్పు, వడ్డీ చెల్లించడం కొంత ఆలస్యం కావొచ్చు. అలాంటప్పుడు ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను వడ్డీ వ్యాపారులు తీసుకెళ్లిన సందర్భాలు చూశాం. కానీ ఈ వడ్డీ వ్యాపారి మాత్రం బాధితుడి భార్యపై కన్నేశాడు. వడ్డీ చెల్లించలేదని బాధితుడి భార్యపై అనేకసార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన గుజరాత్ రాజ్‌కోట్ జిల్లాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఆటో డ్రైవర్‌గా జీవితాన్ని కొనసాగిస్తున్న ఓ వ్యక్తి.. అజిత్ సింగ్ చావ్డా అనే వడ్డీ వ్యాపారి వద్ద 2021లో రూ. 50 వేలు అప్పు తీసుకున్నాడు. ఈ అప్పుకు గానూ ప్రతి రోజు రూ. 1500 వడ్డీ చెల్లించేందుకు ఆటో డ్రైవర్ ఒప్పుకున్నాడు. ఈ ఏడాది జనవరి వరకు ఆటో డ్రైవర్ వడ్డీ చెల్లించాడు. ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో వడ్డీ చెల్లించలేకపోయాడు. దాదాపు 11 నెలల వడ్డీ చెల్లించకపోవడంతో అజిత్ సింగ్ తన వ్యాపార భాగస్వామి దీపక్ వగాడియాను రంగంలోకి దించాడు.
దీంతో దీపక్ ప్రతి రోజు ఆటో డ్రైవర్ ఇంటికెళ్లి.. వడ్డీ ఎప్పుడు చెల్లిస్తావు అని వేధించడం మొదలుపెట్టాడు. కొంత సమయం కావాలని, ఆ సమయం వరకు తప్పకుండా చెల్లిస్తానని వేడుకున్నప్పటికీ వడ్డీ వ్యాపారి వినిపించుకోలేదు. ఆటో డ్రైవర్ భార్యను కిడ్నాప్ చేశారు. పిల్లలను చంపేస్తామని బెదిరించారు. అంతేకాకుండా.. వడ్డీ చెల్లించనందుకు శిక్షగా.. ఆటో డ్రైవర్ భార్యను బెదిరించి పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. వడ్డీ వ్యాపారి ఆగడాలు, వేధింపులు భరించలేని బాధితురాలు చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో దీపక్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.