MSG | ‘మన శంకరవరప్రసాద్ గారు’లో మెరిసిన కొత్త ముఖం ఎవరు? .. సోషల్ మీడియా నుంచి సిల్వర్ స్క్రీన్ ప్ర‌యాణం

MSG | మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనంగా నిలుస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై మొదటి షో నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది.

  • By: sn |    movies |    Published on : Jan 17, 2026 4:29 PM IST
MSG | ‘మన శంకరవరప్రసాద్ గారు’లో మెరిసిన కొత్త ముఖం ఎవరు? .. సోషల్ మీడియా నుంచి సిల్వర్ స్క్రీన్ ప్ర‌యాణం

MSG | మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనంగా నిలుస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై మొదటి షో నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఇప్పటికే రూ.226 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించడంతో, ఈ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో కనిపించగా, క్యాథరీన్ థెరీసా, సచిన్ ఖేడ్కర్, హర్షవర్ధన్, అభినవ్ గోమఠం, శరత్ సక్సేనా వంటి పలువురు ప్రముఖ నటులు కీలక పాత్రల్లో మెరిశారు. అయితే, వీరితో పాటు సెకండాఫ్‌లో ఓ కొత్త ముఖం ప్రేక్షకుల దృష్టిని విశేషంగా ఆకర్షించింది. శశి (నయనతార) స్నేహితులుగా వచ్చే పాత్రల్లో ఒకరు చెప్పిన డైలాగులు, ఆమె నటన సినిమాకు అదనపు హైలైట్‌గా నిలిచాయి. ఆ పాత్రలో కనిపించిన అమ్మాయి ఎవరు? అన్న ఆసక్తి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చగా మారింది.

ఆమె పేరు రమానందన, అందరికీ పరిచయమైన పేరు మాత్రం ‘నందు’. ఫ్యామిలీతో కలిసి యూకేలో సెటిల్ అయిన నందు, ఒకవైపు జాబ్ చేస్తూనే మరోవైపు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ‘Nandu’s World’ అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా కరోనా కాలం నుంచి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తూ వస్తున్న ఆమెకు ప్రస్తుతం 27 లక్షలకుపైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. డైలీ లైఫ్, ఫ్యామిలీ, కామెడీ టచ్‌తో చేసే వీడియోలు ఆమెను సోషల్ మీడియాలో స్టార్‌గా మార్చాయి.

అయితే నందు ప్రయాణం అంత సులభం కాదు. వ్యక్తిగత జీవితంలో, వృత్తిపరంగా ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని, విమర్శలు, ట్రోల్స్‌ను తట్టుకుంటూ ఈ స్థాయికి చేరుకున్నారు. అయినా వెనకడుగు వేయకుండా తన కంటెంట్‌తో ముందుకు సాగిన ఆమెకు ఇప్పుడు మెగాస్టార్ సినిమా ద్వారా సిల్వర్ స్క్రీన్ అవకాశమొచ్చింది. ఇది కేవలం అదృష్టం మాత్రమే కాదు, ఆమె కష్టానికి వచ్చిన ఫలితమని ఆమె స్నేహితులు, అభిమానులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో నందు స్నేహితురాలు సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. “ఒక లెజెండరీ నటుడి పక్కన నిలబడి, డైలాగ్స్ చెప్పే అవకాశం రావడం చిన్న విషయం కాదు. విమర్శల్ని తట్టుకొని నిలబడిన నందుకి ఇది గెలుపు” అంటూ ఆమెకు అభినందనలు తెలిపారు. ఐదు నిమిషాల సీన్ అయినా, ఆ పాత్ర ప్రేక్షకుల మదిలో నిలిచేలా చేసింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

సోషల్ మీడియా నుంచి వెండితెర వరకు నందు చేసిన ఈ ప్రయాణం ఎంతోమందికి ప్రేరణగా మారుతోంది. ‘మన శంకరవరప్రసాద్ గారు’ తో వచ్చిన గుర్తింపును భవిష్యత్తులో మరిన్ని అవకాశాలుగా మలుచుకుంటుందేమో చూడాలి. ఏదేమైనా, ఈ బ్లాక్‌బస్టర్ సినిమాలో ఆమె కనిపించిన తీరు మాత్రం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.