Medaram : శ్రీ సమ్మక్క సారలమ్మ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు
మేడారం ట్రస్ట్ బోర్డు ఏర్పాటు! చైర్మన్‌గా ఇర్ప సుకన్య ప్రమాణ స్వీకారం. మంత్రి సీతక్క సమక్షంలో బాధ్యతలు చేపట్టిన 15 మంది డైరెక్టర్లు. ఆలయ అభివృద్ధిపై మంత్రి దిశానిర్దేశం.
విధాత, ప్రత్యేక ప్రతినిధి: ములుగు జిల్లాలోని శ్రీ మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజాతర ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేశారు. బోర్డు చైర్మన్‌గా ఇర్ప సుకన్య సునీల్ దొరను నియమించగా దీంతోపాటు డైరెక్టర్లుగా 15 మందిని నియమించగా శనివారం బోర్డు సభ్యులతో మేడారం ఈఓ వీరస్వామి ప్రమాణం చేయించారు. డైరెక్టర్లుగా గీకురు భాగ్య, మైపతి రచన, సూదిరెడ్డి జయమ్మ, పాయం రమణ, పుల్సం పుష్పలత,గుంటోజు పావని, పోడెం రాణి, జనగాం గంగ లక్ష్మీ, భూక్య వసంత, ఇజ్జగిరి మమత, గంటమూరి భాగ్యలక్ష్మి, చింతా చంద్రావతి, సిద్దబోయిన జగ్గారావులను నియమించారు. మేడారం ట్రస్టు బోర్డు ప్రమాణ స్వీకారం మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా మేడారం బోర్డు సభ్యులను మంత్రి అభినందించారు.
ఇవి కూడా చదవండి :
Virat Ramayan Mandir : వైభవంగా బీహార్ లో ప్రపంచ భారీ మహాశివలింగం ప్రతిష్టాపనోత్సవం
Komatireddy : నల్లగొండ కార్పోరేషన్ తొలి మేయర్ పీఠం కాంగ్రెస్ దే
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram