Virender Sehwag | జెర్సీల‌పై కూడా భార‌త్ అని రాయాలి.. వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్

Virender Sehwag | విధాత‌: ఇండియా ఇక భార‌త్‌గా మార‌నుందా…? అంటే అవున‌నే సంకేతాలు క‌న‌బ‌డుతున్నాయి. త్వ‌ర‌లో జ‌ర‌గబోయే ప్ర‌త్యేక పార్ల‌మెంట్ స‌మావేశాల్లో ఇండియా పేరును భార‌త్‌గా మార్చి, రాజ్యాంగ స‌వ‌ర‌ణ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇందుకు మోదీ స‌ర్కార్ స‌ర్వం సిద్ధం చేసిన‌ట్లు స‌మాచారం. ఈ నేప‌థ్యంలో మాజీ క్రికెట‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించారు. 2023 వ‌ర‌ల్డ్ క‌ప్ అక్టోబ‌ర్ 5 నుంచి న‌వంబ‌ర్ 19వ తేదీ వ‌ర‌కు జ‌ర‌గ‌నుందని, ఈ స‌మ‌రంలో భార‌త ఆట‌గాళ్లు భార‌త్ […]

  • By: Somu    latest    Sep 05, 2023 12:50 PM IST
Virender Sehwag | జెర్సీల‌పై కూడా భార‌త్ అని రాయాలి.. వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్

Virender Sehwag | విధాత‌: ఇండియా ఇక భార‌త్‌గా మార‌నుందా…? అంటే అవున‌నే సంకేతాలు క‌న‌బ‌డుతున్నాయి. త్వ‌ర‌లో జ‌ర‌గబోయే ప్ర‌త్యేక పార్ల‌మెంట్ స‌మావేశాల్లో ఇండియా పేరును భార‌త్‌గా మార్చి, రాజ్యాంగ స‌వ‌ర‌ణ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇందుకు మోదీ స‌ర్కార్ స‌ర్వం సిద్ధం చేసిన‌ట్లు స‌మాచారం.

ఈ నేప‌థ్యంలో మాజీ క్రికెట‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించారు. 2023 వ‌ర‌ల్డ్ క‌ప్ అక్టోబ‌ర్ 5 నుంచి న‌వంబ‌ర్ 19వ తేదీ వ‌ర‌కు జ‌ర‌గ‌నుందని, ఈ స‌మ‌రంలో భార‌త ఆట‌గాళ్లు భార‌త్ అని రాసి ఉన్న జెర్సీల‌ను ధ‌రించి, ఆడాల‌ని సెహ్వాగ్ సూచించారు. ఈ విష‌యాన్ని ట్వీట్ చేశార‌య‌న‌.

మ‌నం ఈ స‌మ‌యంలో నెదార్లండ్స్, మ‌య‌న్మార్‌ను స్ఫూర్తిగా తీసుకొని, ఈ వ‌రల్డ్ క‌ప్‌లో త‌మ జెర్సీల‌పై పేరు మార్చుకోవాల‌ని సెహ్వాగ్ సూచించారు. ఈ విష‌యాన్ని గ‌మ‌నించాల‌ని బీసీసీఐ సెక్ర‌ట‌రీ జ‌య్ షాకు ఆయ‌న సూచించారు.

1996 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో నెద‌ర్లాండ్స్ హాలండ్ అని రాసి ఉన్న జెర్సీ ధ‌రించి ఆడింది. కానీ 2003లో నెదర్లాండ్స్ అని రాసి ఉన్న జెర్సీని ధ‌రించాల‌ని సెహ్వాగ్ గుర్తు చేశారు. అలాగే మ‌య‌న్మార్ కూడా బ‌ర్మాను పేరు మార్చుకుంది. బ్రిటీష్ వాళ్లు పెట్టిన పేరు బ‌ర్మాను మ‌ళ్లీ మ‌య‌న్మార్‌గా మార్చుకున్నార‌ని తెలిపారు. ఆ విధంగా మ‌నం కూడా భార‌త్ అని మార్చుకోవడంలో త‌ప్పు లేద‌ని సెహ్వాగ్ పేర్కొన్నారు.

ఒక పేరు మ‌నలో గొప్ప‌త‌నాన్ని నింపేదిగా ఉండాల‌ని తాను ఎప్పుడు న‌మ్ముతాన‌ని ఆయ‌న పేర్కొన్నారు. మ‌నంద‌రం భార‌తీయులం. ఇండియా అని బ్రిటీషోళ్లు నామ‌క‌రణం చేశారు. కానీ మ‌న దేశం అస‌లు పేరు భార‌త్‌. ఆ పేరును ఎప్పుడో తిరిగి పొందాల్సి ఉండాల్సింది. కానీ కాలం గ‌డిచిపోయింది. ఈ ప్ర‌పంచ క‌ప్‌లో మ‌న ఆట‌గాళ్లు భార‌త్ పేరున్న జెర్సీ ధ‌రించి ఆడితే చూడాల‌నుకుంటున్నాన‌ని సెహ్వాగ్ పేర్కొన్నారు.