Privatization: విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్ముడే.. తగ్గేదే ల్యా… మళ్ళీ స్పష్టం చేసిన కేంద్రం..
పునఃపరిశీలన లేదని తేల్చిచెప్పిన కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే ఉద్యోగ సంఘాలతో యాజమాన్యం చర్చలు చేస్తుందని ప్రకటన.. విధాత: ప్రభుత్వ ఆస్తులు ప్రయివేటీకరణ చేసే విషయంలో మంచి జోరుమీదున్న కేంద్రం ఆ విషయంలో వెనక్కి తగ్గేది లేదని మళ్ళొక్కసారి తేల్చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్(Visakha steel plant )ను అమ్మడం తథ్యం అని చెప్పేసింది. ఈ విషయంపై రాజ్యసభలో టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ […]

- పునఃపరిశీలన లేదని తేల్చిచెప్పిన కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే
- ఉద్యోగ సంఘాలతో యాజమాన్యం చర్చలు చేస్తుందని ప్రకటన..
విధాత: ప్రభుత్వ ఆస్తులు ప్రయివేటీకరణ చేసే విషయంలో మంచి జోరుమీదున్న కేంద్రం ఆ విషయంలో వెనక్కి తగ్గేది లేదని మళ్ళొక్కసారి తేల్చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్(Visakha steel plant )ను అమ్మడం తథ్యం అని చెప్పేసింది. ఈ విషయంపై రాజ్యసభలో టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే(Faggan Singh kulaste)సమాధానం ఇచ్చారు. ఎట్టిపరిస్థితిలోనూ ఈ విషయంలో కేంద్రం మనసు మార్చుకోదని తెలిపారు. ఉద్యోగులు ఆందోళన చేస్తున్న విషయం తమకు కూడా తెలుసునని మంత్రి చెప్పారు.
అంతటితో ఆగకుండా ఉద్యోగ సంఘాలతో స్టీల్ ప్లాంట్ యాజమాన్యం చర్చలు జరుపుతోందని, వారిని ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని.. ఈ విషయంలో విజయం సాధిస్తామని మంత్రి తెలిపారు. అయితే.. మరో అనుబంధ ప్రశ్నగా కనకమేడల మాట్లాడుతూ.. ఉద్యోగుల ఆందోళనల దృష్ట్యా నిర్ణయం మార్చుకుంటారా? అని అడిగారు.
దేశంలో విశాఖతోపాటు ఇంకా కొన్ని పరిశ్రమలను ప్రైవేటీకరిం చాలని నిర్ణయించామని.. ఈ విషయంలో పునఃపరిశీలించే ప్రతిపాదననేది లేదని మంత్రి తేల్చి చెప్పారు.
దీంతో విశాఖ ఉక్కు కర్మాగారం ఉత్పత్తి పూర్తిగా తల్లకిందులైంది. ఉద్యోగుల నియామకాలు నిలిచిపోయాయి. ఉత్పత్తి కూడా సగానికి సగం నిలిచిపోయింది. వాస్తవానికి స్టీల్ ప్లాంట్లో ఏటా 200 నుంచి 300 మంది ఎగ్జిక్యూటివ్ ట్రైనీలను రిక్రూట్ చేయడం ఆనవాయితీ. కానీ కొన్నేళ్లుగా రిటైర్మెంట్స్ తప్ప కొత్త నియామకాలులేవు.
మూడేళ్ల క్రితం విశాఖ ఉక్కులో ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్ కలిపి 17000 మంది ఉద్యోగులు ఉండగా.. ఇప్పుడు వారి సంఖ్య 14880కి పడిపోయింది. సో.. దీనిని బట్టి కేంద్రం పరోక్షంగా విశాఖ ఉక్కు గొంతును నులిమేస్తోందని ఉద్యోగులు వాపోతున్నారు. కొన్ని రోజులుగా ఉద్యోగులు ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు . కానీ కేంద్రం దాన్ని అమ్మేసే విషయంలో పట్టుదలగా ఉంది.