ఫేస్బుక్‌లో అశ్లీల ఫొటోలు: స్పందించిన విష్ణుప్రియ.. అసలు విషయం ఏంటంటే?

విధాత, సినిమా: బుల్లితెరపై నటిగా, యాంకర్‌గా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో విష్ణుప్రియ కూడా ఒకరు. బుల్లితెరపై ఎన్నో షోలలో యాంకరింగ్ చేస్తూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తూ ఉండే ఈ భీమనేని చిన్నది.. వెండితెరపై కూడా తన సత్తా చాటేందుకు తాపత్రయ పడుతోంది. అందుకోసం సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ.. హాట్ హాట్ వీడియోలతో, డ్యాన్స్‌లతో కుర్రాళ్ళ మతులు పోగొడుతోంది. ఈ మధ్య ఆమె పేరు ఈ వీడియోల విషయంలో బాగా […]

  • By: krs    latest    Oct 21, 2022 12:45 PM IST
ఫేస్బుక్‌లో అశ్లీల ఫొటోలు:  స్పందించిన విష్ణుప్రియ.. అసలు విషయం ఏంటంటే?

విధాత, సినిమా: బుల్లితెరపై నటిగా, యాంకర్‌గా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో విష్ణుప్రియ కూడా ఒకరు. బుల్లితెరపై ఎన్నో షోలలో యాంకరింగ్ చేస్తూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తూ ఉండే ఈ భీమనేని చిన్నది.. వెండితెరపై కూడా తన సత్తా చాటేందుకు తాపత్రయ పడుతోంది.

అందుకోసం సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ.. హాట్ హాట్ వీడియోలతో, డ్యాన్స్‌లతో కుర్రాళ్ళ మతులు పోగొడుతోంది.

ఈ మధ్య ఆమె పేరు ఈ వీడియోల విషయంలో బాగా వినబడుతోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ అమ్మడుకి ఓ చేదు అనుభవం ఎదురైంది.

విష్ణుప్రియ ఫేస్‌బుక్ అకౌంట్ నుంచి కొన్ని అసభ్యకరమైన, అశ్లీలమైన ఫొటోలు దర్శనమివ్వడంతో.. ఒక్కసారిగా సోషల్ ప్రపంచం షాకైంది. ఛీ.. ఛీ. ఇంతగా విష్ణుప్రియ దిగజారింది ఏంటి అని అంతా ఆమెపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

అయితే ఈ ఫొటోలు ఎవరు పోస్ట్ చేస్తున్నారో తనకు తెలియదంటూ విష్ణు ప్రియ లబోదిబో మంటోంది. వాస్తవానికి తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో తన ఫొటోలే కాకుండా.. ఇతరుల ఫొటోలు కూడా ఫేస్ మార్ఫింగ్‌తో ఉండటం గమనించవచ్చు. వాటిని చూసిన వారంతా.. ఇది విష్ణుప్రియ పనికాదనేలా క్లారిటీకి వచ్చారు. ఆమె కూడా ఇదే విషయం చెబుతూ.. ఇన్‌‌స్టాగ్రమ్ వేదికగా ఓ వీడియోను షేర్ చేసింది.

‘‘నా ఫేస్‌బుక్ అకౌంట్ ఎప్పుడో హ్యాక్ అయింది. రెండు నెలల నుంచి ట్రై చేస్తున్నాను. ఇంకా నాకు అది రాలేదు. అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది.

ఇప్పటికి రెండు సార్లు నా అకౌంట్ హ్యాక్ అయింది. దయచేసి ఆ పేజీపై రిపోర్ట్ చేయండి.. అందరూ అన్‌ఫాలో చేయండి.

ప్రస్తుతం పోస్ట్ అయిన అసభ్యకరమైన కంటెంట్ విషయంలో నేను అందరికీ క్షమాపణలు చెబుతున్నాను. దయచేసి ఈ మెసేజ్‌ను అందరికీ షేర్ చేయగలరు’’ అని విష్ణుప్రియ తన ఇన్‌స్టాగ్రమ్ వేదికగా కోరింది.