Voter List | తప్పులు లేని ఓటర్ల జాబితా రూపొందించండి: సీఈఓ వికాస్‌ రాజ్‌

Voter List ఈ నెల 25 వరకు అన్నిస్థాయిలలో శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేయాలి మాస్టర్‌ ట్రైనర్లకు శిక్షణ కార్యక్రమంలో సీఈఓ వికాస్‌ రాజ్‌ విధాత: ఈ ఏడాది చివరలో జరిగే అసెంబ్లీ సాధారణ ఎన్నికలకు తప్పులు లేని ఓటర్ల జాబితా రూపొందించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌ రాజ్‌ ఆదేశించారు. శనివారం హైదరాబాద్‌లో 33 జిల్లాలకు చెందిన జిల్లా స్థాయి మాస్టర్‌ ట్రైనర్లతో ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వికాస్‌ రాజ్‌ […]

Voter List | తప్పులు లేని ఓటర్ల జాబితా రూపొందించండి: సీఈఓ వికాస్‌ రాజ్‌

Voter List

  • ఈ నెల 25 వరకు అన్నిస్థాయిలలో శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేయాలి
  • మాస్టర్‌ ట్రైనర్లకు శిక్షణ కార్యక్రమంలో సీఈఓ వికాస్‌ రాజ్‌

విధాత: ఈ ఏడాది చివరలో జరిగే అసెంబ్లీ సాధారణ ఎన్నికలకు తప్పులు లేని ఓటర్ల జాబితా రూపొందించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌ రాజ్‌ ఆదేశించారు. శనివారం హైదరాబాద్‌లో 33 జిల్లాలకు చెందిన జిల్లా స్థాయి మాస్టర్‌ ట్రైనర్లతో ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా వికాస్‌ రాజ్‌ మాట్లాడుతూ ఈ నెల18వ తేదీన నియోజకవర్గ స్థాయి మాస్టర్‌ ట్రైనర్లతో, 19వ తేదీన మండల స్థాయిలో బీఎల్‌ఓలకు శిక్షణ ఇవ్వాలన్నారు.

రాష్ట్రంలో అన్ని స్థాయిలలో శిక్షణ కార్యక్రమాలన్నీ ఈ నెల25 వరకు పూర్తి చేయాలని ఆదేశించారు. ఓటర్ల జాబితా రూపకల్పనలో బూత్‌ లెవల్‌ అధికారుల పాత్ర కీలకమన్నారు.