రాజ్‌భవన్‌కు సీఈవో వికాస్‌రాజ్
తెలంగాణ సీఈవో వికాస్ రాజ్ సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ తమిళిసైని కలువనున్నారు

- కొత్త సీఎం ప్రమాణోత్సవానికి కసరత్తు
విధాత : తెలంగాణ సీఈవో వికాస్ రాజ్ సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ తమిళిసైని కలువనున్నారు. గెలిచిన ఎమ్మెల్యేల వివరాల జాబితాను సీఈవో గవర్నర్‌కు అందిస్తారు. సీఈవో నివేదిక అందిన వెంటనే కొత్త శాసనసభ ఏర్పాటుకు గవర్నర్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తారు. మరోవైపు ఈ రోజు నాలుగు గంటల తర్వాతే గవర్నర్ నుంచి పోలిటికల్ అపాయింట్మెంట్లకు అవకాశం ఉందని రాజ్‌భవన్ వర్గాల సమాచారం.