Warangal | వనరులను దోచుకుంటున్న BRS.. చోద్యం చూస్తున్న మంత్రులు, MLAలు: రాజేందర్‌రెడ్డి

Warangal జైలును కూలగొట్టి భూమి తాకట్టు హాస్పిటల్ పేర రూ,11,50 కోట్ల ఋణం పాత సెంట్రల్ జైలు వద్ద నిరసన కాంగ్రెస్ నేత రాజేందర్‌రెడ్డి విమర్శ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: భవిష్యత్ తరాలకు అందాల్సిన వనరులను వరంగల్ నుండి బిఆర్ఎస్ ప్రభుత్వం దోచుకుపోతుంటే జిల్లాకు చెందిన మంత్రులు ఎమ్మెల్యేలు అసమర్ధులుగా మారి చోద్యం చూస్తున్నారని కాంగ్రెస్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి విమర్శించారు. వరంగల్ పాత సెంట్రల్ జైలు స్థలం వద్ద మంగళవారం […]

Warangal | వనరులను దోచుకుంటున్న BRS.. చోద్యం చూస్తున్న మంత్రులు, MLAలు: రాజేందర్‌రెడ్డి

Warangal

  • జైలును కూలగొట్టి భూమి తాకట్టు
  • హాస్పిటల్ పేర రూ,11,50 కోట్ల ఋణం
  • పాత సెంట్రల్ జైలు వద్ద నిరసన
  • కాంగ్రెస్ నేత రాజేందర్‌రెడ్డి విమర్శ

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: భవిష్యత్ తరాలకు అందాల్సిన వనరులను వరంగల్ నుండి బిఆర్ఎస్ ప్రభుత్వం దోచుకుపోతుంటే జిల్లాకు చెందిన మంత్రులు ఎమ్మెల్యేలు అసమర్ధులుగా మారి చోద్యం చూస్తున్నారని కాంగ్రెస్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి విమర్శించారు.

వరంగల్ పాత సెంట్రల్ జైలు స్థలం వద్ద మంగళవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ సెంట్రల్ జైలు స్థలాన్ని సైతం వదలకుండా కుదువ పెట్టిన ఘనత సి.ఎం. కే.సి.ఆర్ దేనన్నారు.

సెంట్రల్ జైలు కూల్చి దాని స్థానంలో రూ.1150 కోట్లతో 24 అంతస్తుల్లో మల్టీ సూపర్ స్పెషాలిటి ఆసుపత్రి కడుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు.

తెలంగాణా సూపర్ స్పెషాలిటి హాస్పిటల్స్ కార్పోరేషన్ ఎం.డి. డాక్టర్ రమేష్ రెడ్డి పేరుతో మార్టిగేజ్ చేసుకొని మహారాష్ట్ర లోని శివాజినగర్ లో ఉన్న బ్యాంక్ అఫ్ మాహరాష్ట్రా పూణే బ్రాంచ్లో రూ,11,500 కోట్ల ఋణం తీసుకున్నారన్నారు.

బిఆర్ఎస్ ప్రభుత్వంలో జిల్లాకు కొత్తగా తీసుకువచ్చేది లేదు కానీ.. ఉన్న సంస్థలు జిల్లా నుండి తరలి పోతున్నాయన్నారు. టీఆర్ఎస్ సర్కార్ తీసుకుంటున్ననిర్ణయాలతో పలు చారిత్రాత్మక కట్టడాలు కనుమరుగు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

మామునూరు 4వ బెటాలియన్‌లో వంద ఎకరాల స్థలాన్ని జైలు నిర్మాణం కోసం కేటాయించారు. రూ.254 కోట్ల నిధులకు అనుమతులు జారీ చేసీ ఒక్కపైసా కూడా ఇవ్వనందున జైలు నిర్మాణం పనులు ప్రారంభం కాలేదన్నారు. అభివృద్ధి పేరిట చారిత్రక వరంగల్ జిల్లాను ఐదు ముక్కలుగా విడగొట్టారని విమర్శించారు.

ఎం.జి.ఎం ఆసుపత్రికి వసతులు కల్పించకుండా పేషంట్లను ఎలుకలకు అప్ప చెప్పిన ఘనత కే.సి.ఆర్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కమీషన్లకు కక్కుర్తి పడి అభివృద్ధిని మారుస్తున్నారని, మంత్రులు, ఎమ్మెల్యేలు తమ జేబులు నింపుకోవటంలో ఉన్న శ్రద్ధ జిల్లా అభివృద్ధిపై లేదని అన్నారు.

కార్యక్రమంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, వరంగల్ జిల్లా మైనారిటీ సెల్ చైర్మన్ మహమ్మద్ అయూబ్, ఎస్.సి. డిపార్టుమెంటు నేషనల్ కో-ఆర్డినేటర్ డాక్టర్ పులి అనిల్ కుమార్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ, జిల్లా ఎస్.సి. డిపార్టుమెంటు చైర్మన్ డాక్టర్ పి. రామకృష్ణ, జిల్లా INTUC చైర్మన్ కూర వెంకట్, జిల్లా హ్యాండ్ లూమ్స్ & వీవర్స్ కమిటీ చైర్మన్ చిప్ప వెంకటేశ్వర్లు, జిల్లా NSUI అద్యక్షుడు పల్లకొండ సతీష్, మాజీ కార్పొరేటర్ ఎంబాడి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.