Warangal | విషాదం నింపిన దశాబ్ది ఉత్సవాలు.. ట్రాక్టర్ కిందపడి పాఠశాల విద్యార్థి మృతి
Warangal ఆ ఇంట తీరని కడుపుకోత హనుమకొండ జిల్లాలో సంఘటన విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: హనుమకొండ జిల్లాలో తెలంగాణ దశాబ్ది ఉత్సవ సంబరాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఓ ఇంటి కంటిపాప ఆరిపోయింది. కన్నవారికి కడుపుకోత మిగిలింది. విద్యా దినోత్సవం సందర్భంగా కమలాపూర్ మండలం మరిపెళ్లి గూడెంలో మంగళవారం పాఠశాల విద్యార్థులతో ర్యాలీ తీస్తుండగా ట్రాక్టర్ కింద పడి 6వ తరగతి విద్యార్థి ఇనుగాల ధనుష్(10)మృతి చెందాడు. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. విద్యార్థులతో […]

Warangal
- ఆ ఇంట తీరని కడుపుకోత
- హనుమకొండ జిల్లాలో సంఘటన
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: హనుమకొండ జిల్లాలో తెలంగాణ దశాబ్ది ఉత్సవ సంబరాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఓ ఇంటి కంటిపాప ఆరిపోయింది. కన్నవారికి కడుపుకోత మిగిలింది. విద్యా దినోత్సవం సందర్భంగా కమలాపూర్ మండలం మరిపెళ్లి గూడెంలో మంగళవారం పాఠశాల విద్యార్థులతో ర్యాలీ తీస్తుండగా ట్రాక్టర్ కింద పడి 6వ తరగతి విద్యార్థి ఇనుగాల ధనుష్(10)మృతి చెందాడు. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
విద్యార్థులతో ర్యాలీ తీస్తుండగా కిరాణం దుకాణంలోకి వెళ్లి బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకుంటుండగా బాలున్ని కుక్కలు వెంటపడ్డాయి. కుక్కల బారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో అటుగా వస్తున్న ట్రాక్టర్ కింద పడి విద్యార్థి ధనుష్ మృతి చెందాడు.
ప్రాథమిక పాఠశాలలో 5 వ తరగతి పూర్తి చేసి ఈ విద్యా సంవత్సరం 6 వ తరగతిలో ప్రవేశం కోసం స్థానిక హైస్కూల్లో ధనుష్ చేరాడు. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనతో కన్న తల్లిదండ్రులు జయపాల్, స్వప్న కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
తమ ఒక్కగానొక్క కొడుకు పొద్దున ఆనందంగా టాటా చెబుతూ ఇంటి నుంచి వెళ్లి ఇప్పుడు విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. గ్రామస్తులు పాఠశాల నిర్వాహకుల తీరు పై, అధికారుల నిర్లక్ష్యం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.