Warangal | రెండేళ్లలో రూ.895 కోట్లతో అభివృద్ధి: మేయర్
Warangal 4270 పనులు చేపట్టిన వరంగల్ బల్దియా రెండేళ్లు పూర్తి చేసుకున్న పాలకవర్గం తాగునీటి సమస్యకు రూ.10కోట్ల నిధులు ముంపు నివారణకు రూ.150 కోట్ల పనులు నెలాఖరికి నాలలలో పూడికతీత పూర్తి మేయర్ గుండు సుధారాణి విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రెండు సంవత్సరాల్లో అన్ని పథకాలు కలిపి సుమారు 895 కోట్ల రూపాయల వ్యయంతో 4270 పనులు ప్రతిపాదించగా అందులో 60% పనులు పూర్తి అయ్యాయని మిగిలిన పనులు పురోగ దశల్లో ఉన్నాయని వరంగల్ నగర […]

Warangal
- 4270 పనులు చేపట్టిన వరంగల్ బల్దియా
- రెండేళ్లు పూర్తి చేసుకున్న పాలకవర్గం
- తాగునీటి సమస్యకు రూ.10కోట్ల నిధులు
- ముంపు నివారణకు రూ.150 కోట్ల పనులు
- నెలాఖరికి నాలలలో పూడికతీత పూర్తి
- మేయర్ గుండు సుధారాణి
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రెండు సంవత్సరాల్లో అన్ని పథకాలు కలిపి సుమారు 895 కోట్ల రూపాయల వ్యయంతో 4270 పనులు ప్రతిపాదించగా అందులో 60% పనులు పూర్తి అయ్యాయని మిగిలిన పనులు పురోగ దశల్లో ఉన్నాయని వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి సంతృప్తి వ్యక్తం చేశారు. అనుకున్న దానికంటే ఎక్కువగా అభివృద్ధి పనులు చేపట్టామని, పట్టణ ప్రగతి, సిఎం హామీల పథకం, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక నిధులు, స్మార్ట్ సిటి తదితర పథకాల ద్వారా ముఖ్యమైన పనులు పూర్తి చేశామన్నారు.
మేయర్ అధ్యక్షతన సోమవారం కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కౌన్సిల్ ముందుంచిన 8 ఎజెండా అంశాలకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది.
తాగునీటి పనులకు రూ.10కోట్లు
ఈ సందర్భంగా మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ మేడే కానుకగా కార్మికులకు పెంచిన వెయ్యి రూపాయల వల్ల 2810 మందికి లబ్ధి చేకూరుతుందని మేయర్ పేర్కొన్నారు. తాగునీటి పనుల కోసం 15వ ఆర్థిక సంఘం 10 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేశారు. రెండు మూడు నెలల్లో అన్ని కాలనీలకు ప్రతిరోజు త్రాగునీరు అందించేందుకు దృష్టి సారించామని చెప్పారు.
రూ.150కోట్లతో ముంపు నివారణ
ముంపు నుంచి తప్పించేందుకు సుమారు రూ.150 కోట్ల నిధులతో వరద నీటి కాలువలు, కల్వర్ట్ ల నిర్మాణ పనులు సాగుతున్నాయి. 33 ప్రధాన నాలాల్లో పూడికతీత పనులు నెలాఖరు నాటికి పూర్తవ్వాలని ఆదేశించారు. ఈ ఏడాది పవర్ బోర్లు, చేతిబోర్లు, పైప్ లైన్ లీకేజీలు నీరందని ప్రాంతాలకు త్రాగునీటి సరఫరా నిర్వాహణ కోసం 5 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. నగరంలో కుక్కలు, కోతులు, పందుల బెడద దృష్ట్యా వాటి నివారణకు ప్రణాళిక బద్దంగా దశల వారిగా చర్యలు చేపట్టామని వివరించారు.
ఈ నెల 15వ తేది నుండి సిఎం కప్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. 2 స్వర్గ రథాలకు తోడుగా మరో 4 (2 స్వర్గ రథాలు, 2 ఆఖ్రి సఫర్ రథాలు), ట్రాక్టర్లు, డస్ట్ బిన్స్ కొనుగోలుకు ఆమోదించారు.
సమస్యలు చెప్పిన కార్పొరేటర్లు
ఈ సందర్భంగా కార్పొరేటర్లు డివిజన్లలో అపరిష్కృత సమస్యలను మేయర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమావేశంలో ఎం ఎల్ సి బస్వరాజు సారయ్య, వరంగల్ కలెక్టర్, బల్దియా ఇన్‌చార్జి కమిషనర్ ప్రావీణ్య, డిప్యూటీ మేయర్ రిజ్వానా శమీమ్ మసూద్, కార్పొరేటర్లు, వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.