Warangal | గ్రీన్ ఫీల్డ్ హైవేతో రైతులకు అన్యాయం: ఎమ్మెల్యే ధర్మారెడ్డి

Warangal | ప్రధాని మోడీ శంఖుస్థాపన చేయడం సిగ్గుచేటు గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం నిలిపివేయాలి కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ను ఏర్పాటు చేశామని ప్రధాని పేర్కొనడం విడ్డూరం పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆగ్రహం విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ను తామే ఏర్పాటు చేశామని ప్రధాని మోదీ పేర్కొనడం సిగ్గుచేటని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. టెక్స్‌టైల్‌ పార్క్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ […]

Warangal | గ్రీన్ ఫీల్డ్ హైవేతో రైతులకు అన్యాయం: ఎమ్మెల్యే ధర్మారెడ్డి

Warangal |

  • ప్రధాని మోడీ శంఖుస్థాపన చేయడం సిగ్గుచేటు
  • గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం నిలిపివేయాలి
  • కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ను ఏర్పాటు చేశామని ప్రధాని పేర్కొనడం విడ్డూరం
  • పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆగ్రహం

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ను తామే ఏర్పాటు చేశామని ప్రధాని మోదీ పేర్కొనడం సిగ్గుచేటని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. టెక్స్‌టైల్‌ పార్క్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ఏర్పాటుచేశారని పేర్కొన్నారు.

ఆదివారం ఎమ్మెల్యే చల్లా విడుదల చేసిన ప్రకటన వివరాలిలా ఉన్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన కాకతీయ మెగా వస్త్ర పరిశ్రమను మేమే ఏర్పాటుచేశామని ప్రధాన మంత్రి మోడీ మాట్లాడం సిగ్గుచేటు.కాకతీయ మెగా వస్త్ర పరిశ్రమకు ప్రత్యేక నిధులు,స్థానం కల్పిస్తామని ప్రగల్బాలు పలికిన రాష్ట్ర బిజెపి నాయకులు మోడీ నోటి వెంట ఆ మాటే రాలేదు. అలాగే ఖాజిపేటలో రైల్వే కోచ్ ఫాక్టరీ ఏర్పాటుచేస్తామని చెప్పి పాత బోగీలకు ప్యాచులు వేసే ఫాక్టరీకి శంఖుస్థాపన చేశారు.

నియోజకవర్గం మీదుగా నిర్మాణం చేపట్టనున్న గ్రీన్ ఫీల్డ్ హైవేతో నియోజకవర్గంలోని రైతులకు అపార నష్టం వాటిల్లడమే కాకుండా రైతులంతా రోడ్డున పడతారు.గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులతో కనీసం సంప్రదింపులు జరపకుండా శంఖుస్థాపన చేయడంతో ప్రధాని మోడీకి రైతులపై కపట ప్రేమ తెలుస్తుంది.

ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం వళ్ళ అదానీ,అంబానీలకు మాత్రమే లాభమని,రైతులకు ఎలాంటి లాభం లేదు. మార్కెట్ విలువలో ఎకరానికి 1 కోటి నుండి 3 కోట్ల వరకు విలువచేసే భూములను రైతులు కోల్పోతుంటే రాష్ట్ర బిజెపి నాయకులు,కాంగ్రెస్ నాయకుల్లో కనీసం చలనం లేదు.ఢిల్లీలో ఉన్న మంత్రులకు ప్రత్యేకంగా కలిసి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం ఏర్పాటు నిలిపివేయాలని వినతి చేసుకున్నా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది.

రైతులకు ఎలాంటి అవసరానికి పనికి రాని ఈ రోడ్డు నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితిలో చేపట్టనివ్వమని తెలిపారు.కాకతీయ మెగా వస్త్ర పరిశ్రమ ఏర్పాటుచేయడం కోసం ఆ రోజు రెండు నెలలు భూసేకరణకు కష్టపడితే రైతులకు మాయ మాటలు చెప్పి తప్పుదోవ పట్టించారు.

వస్త్ర పరిశ్రమని ఆపాలని చూసిన బిజెపి,కాంగ్రెస్ నాయకులు ఈ రోజు ఏడ పోయారు.టెక్సటైల్ పార్కు ఏర్పాటులో ఎకరాకు 3 లక్షలు మార్కెట్ లో ఉంటె సీఎం కేసీఆర్,మంత్రి కేటీఆర్ చొరవతో ఒక ఎకరాకు 10 లక్షలు మరియు 100 గజాల స్థలం నష్ట పరిహారంగా చెల్లించి రైతులను ఆదుకున్నాం.

అదేవిధంగా గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు మార్కెట్ విలువకు మూడు రెట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు.లేకుంటే రైతుల పక్షాన పోరాటం చేస్తామని తెలిపారు.ప్రధాని మోదీ ధనికులకు రూ.12 లక్షల కోట్లు మాఫీ చేశారుకాని,రైతులకు న్యాయం చేయడానికి మనసురావడంలేదన్నారు.

ప్రధాని మోదీకి ఈడీ, సీబీఐ అండగా ఉంటే తమకు తెలంగాణ ప్రజలు అండగా ఉన్నారు. ప్రధాని మోదీ కేవలం కేసీఆర్‌ను తిట్టడానికి, ఇంత సమయం, అంత ఖర్చు చేసి, వరంగల్‌ దాకా వచ్చారా? తెలంగాణకు ఏమి చేశారో..? వరంగల్‌కు ఏమి చేశారో చెప్పకుండా కేసీఆర్‌ని తిడతారా?