Warangal: మున్నూరుకాపు కార్పొరేషన్ సాధించుకుందాం: MP రవిచంద్ర

ఆర్థికంగా, రాజకీయంగా బలపడాలి సంఘ భవనానికి రూ.51లక్షలు ప్రకటించిన ఎంపీ రవిచంద్ర విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఒకే కులం ఒకే సంఘం అనే భావనతో మనమందరం మరింత ఐకమత్యంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని మున్నూరుకాపు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. చట్టసభలకు ప్రాతినిథ్యం వహిస్తున్న, ఆయా కార్పోరేషన్స్ చైర్మన్లు అందరం ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు వెళ్లి మున్నూరుకాపుల కోసం ప్రత్యేక కార్పోరేషన్ తో పాటు కోకాపేటలో భవన నిర్మాణానికి […]

Warangal: మున్నూరుకాపు కార్పొరేషన్ సాధించుకుందాం: MP రవిచంద్ర
  • ఆర్థికంగా, రాజకీయంగా బలపడాలి
  • సంఘ భవనానికి రూ.51లక్షలు ప్రకటించిన ఎంపీ రవిచంద్ర

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఒకే కులం ఒకే సంఘం అనే భావనతో మనమందరం మరింత ఐకమత్యంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని మున్నూరుకాపు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. చట్టసభలకు ప్రాతినిథ్యం వహిస్తున్న, ఆయా కార్పోరేషన్స్ చైర్మన్లు అందరం ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు వెళ్లి మున్నూరుకాపుల కోసం ప్రత్యేక కార్పోరేషన్ తో పాటు కోకాపేటలో భవన నిర్మాణానికి మరిన్ని నిధులు సాధిస్తామన్నారు. మన కులానికి, సంఘానికి సంపూర్ణ సహకారం అందించేందుకు కేసీఆర్ ఎల్లప్పుడూ సానుకూలంగానే ఉంటారని రవిచంద్ర వివరించారు.

హన్మకొండలోని అశోకా కన్వెన్షన్ సెంటరులో ఉమ్మడి వరంగల్ జిల్లా మున్నూరుకాపు సంఘం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి ఎంపీ రవిచంద్ర చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, జల వనరుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వి.ప్రకాష్, మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొండా దేవయ్య హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ సంఘానికి హన్మకొండ కాపువాడలో ఉన్న స్థలంలో కమ్యూనిటీ హాలు నిర్మాణానికి తన తల్లిదండ్రులు వెంకటనర్సమ్మ, నారాయణల పేరిట రూ.51లక్షలు అందజేస్తానని రవిచంద్ర హామీనిచ్చారు.

చీఫ్ విప్ దాస్యం వినయ్‌ భాస్కర్ మాట్లాడుతూ మనమందరం ఐకమత్యంతో ముందుకు సాగుతూ ఆర్థికంగా, రాజకీయంగా మరింత బలపడాల్సిన అవసరం ఉందన్నారు. జల వనరుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వి.ప్రకాష్ మాట్లాడుతూ మున్నూరుకాపులు తాము వెనుకబడిన వారమనే భావన విడనాడాల్సిందిగా హితవు పలికారు. పరస్పర సహకారం, ఐకమత్యంతో ముందుకు సాగతూ అన్ని రంగాలలో ఉన్నతంగా రాణించాల్సిన అవసరం ఉందని మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండా దేవయ్య చెప్పారు.

సమ్మేళనంలో మున్నూరుకాపు నాయకులు కటకం పెంటయ్య, వద్దిరాజు వెంకటేశ్వర్లు, రంజితా కృష్ణమూర్తి, శోభారాణి, పుప్పాల ప్రభాకర్, కూసం శ్రీనివాసులు, రమాదేవి, బండి కుమారస్వామి, నాడెం శాంత కుమార్, మాడిశెట్టి మురళి, భద్రి గోరెంట్ల, ఉప్పు రవీందర్, వద్దిరాజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవిచంద్ర, వినయ్ భాస్కర్, ప్రకాష్ లను గజమాల, శాలువాలతో ఘనంగా సత్కరించారు.